కవ్వించే చూపులతో చంపేస్తోన్న లేడీ సికిందర్
హిందీ ప్రేక్షకులను బుల్లి తెర ద్వారా యే మేరి లైఫ్ హై అనే సీరియల్ తో పలకరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్.
By: Tupaki Desk | 11 Jan 2024 9:30 AM GMTహిందీ ప్రేక్షకులను బుల్లి తెర ద్వారా యే మేరి లైఫ్ హై అనే సీరియల్ తో పలకరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేసి తన దైన ముద్ర వేసిన విషయం తెల్సిందే. ఈ అమ్మడు వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది.
ఆకట్టుకునే అందం ఈమె సొంతం అవ్వడం వల్ల రెగ్యులర్ గా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందమైన ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వావ్ అనిపించే అందం ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు.
కవ్వించే చూపులతో ఆకట్టుకునే ఫిజిక్ తో విభిన్నమైన ఔట్ ఫిట్ తో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఎప్పటిలాగే వైరల్ అవుతున్నాయి. ముందు ముందు కూడా ఈ అమ్మడు ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయాలి అంటూ నెటిజన్స్ కోరుకుంటూ ఉన్నారు.
నాలుగు పదుల వయసు దాటినా కూడా పాతికేళ్ల పరువాల అమ్మడు అన్నట్లుగా ఈ అమ్మడి అందం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా జోరు చూసి ఈమెను హిందీ సినిమా ల్లోనే కాకుండా ఇతర భాషల సినిమాల్లోనూ నటింపజేసేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది.