Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైందా..?

కలిసి పనిచేసిన టైం లో అభిప్రాయాలు కలగడం అలా రీల్ లైఫ్ జోడీ కాస్త రియల్ లైఫ్ పార్ట్ నర్స్ అవ్వడం కొత్తేది కాదు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:16 AM GMT
స్టార్ హీరోతో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైందా..?
X

కలిసి పనిచేసిన టైం లో అభిప్రాయాలు కలగడం అలా రీల్ లైఫ్ జోడీ కాస్త రియల్ లైఫ్ పార్ట్ నర్స్ అవ్వడం కొత్తేది కాదు. ఆన్ స్క్రీన్ సినిమాలో భాగమైన కొందరు జీవితాన్ని కూడా షేర్ చేసుకుంటారు. ఇలాంటివి సినీ పరిశ్రమలో చాలా జరిగాయి ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతున్నట్టుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తమిళ్ స్టార్ హీరో, హీరోయిన్ ప్రేమలో ఉన్నారని వారిద్దరు త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఎవరా హీరో హీరోయిన్ అంటే శింబు, నిధి అగర్వాల్ అని తెలుస్తుంది.

కోలీవుడ్ లో లిటిల్ సూపర్ స్టార్ గా శింబు సౌత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. 40 ప్లస్ ఏజ్ ఉన్న శింబు ఈమధ్య పూర్తిగా వెనకపడ్డాడు. స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్న శింబు ప్రస్తుతం కమల్ హాసన్ ప్రొడక్షన్ లో పెరియసామి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే శింబు తో హీరోయిన్ నిధి అగర్వాల్ పెళ్లి అంటూ తమిళ మీడియా వార్తలు హైలెట్ చేస్తుంది.

శింబుతో కలిసి రెండేళ్ల క్రితం ఈశ్వరన్ సినిమా చేసింది నిధి అగర్వాల్. తెలుగులో నుంచి కోలీవుడ్ జంప్ అయిన ఈ అమ్మడు అక్కడే వరుస సినిమాలు చేసింది. తమిళ్ లో నిధికి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అక్కడ ఆమె కోసం గుడి కట్టేంత ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఐతే శింబుతో నిధి లవ్ స్టోరీ కొన్నాళ్లుగా జరుగుతుందని తెలుస్తుంది. వీరిద్దరి మ్యారేజ్ త్వరలో జరుగుతుందని అంటున్నారు.

శింబు హీరోయిన్స్ తో నడిపిన లవ్ స్టోరీస్ గురించి తెలిసిందే. నయనతార తో పీకల్లోతు ప్రేమ కొనసాగించిన శింబు ఆమె నుంచి దూరమయ్యాక ఆమధ్య హాన్సికతో కూడా లవ్ స్టోరీ నడిపించాడు. హాన్సిక మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నిధితో శింబు లవ్ స్టోరీ నడుస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈమెతో అయినా ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా లేదా అన్నది చూడాలి. శింబు సినిమా కోసం ఏ అవతారమైనా ఎత్తుతాడు. హీరోగానే కాదు సింగర్, ఫైట్ మాస్టర్, కంపోజర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అన్నిటిలో తన ప్రావీణ్యం చూపించాడు. శింబు తిరిగి ఫాం లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతుండగా ఈలోగా నిధి లవ్ స్టోరీ వాళ్లని మరోసారి కన్ ఫ్యూజన్ లో పడేస్తుంది.