సింప్లిసిటీకా ఈ బ్యూటీ బాప్ అనిపించిందే!
మరోవైపు టాలీవుడ్ అవకాశాలు క్యూ కడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 25 Feb 2024 12:30 PM GMTసైఫ్అలీ ఖాన్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'కెధరనాద్' తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు నటిగా షైన్ అవుతూ అవకాశాలు అందుకుం టుంది. అమ్మడు 2024 డైరీ ఇప్పటికే ఫిల్ అయింది. హిందీ సినిమాలతోనే క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. మరోవైపు టాలీవుడ్ అవకాశాలు క్యూ కడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అటు కమర్శి యల్స్ సైతం చేస్తోంది.
ఏటా ఆదాయం భారీగానే ఉంది. మరి ఈ బ్యూటీ సింప్లిసిటీ తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. కోట్లు సంపాదిస్తోన్న హీరోయిన్ అయినా మధ్య తరగతి జీవన విధానంలో కనిపిస్తుంది. అన్నిరకాల జీవన విధానానికి అలవాటు పడాలి..ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతికేయగలగాలి అనేలా అమ్మడు జీవితాన్ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. నచ్చిన తిండి..కంటినిండా నిద్ర జీవితంలో ఇంతకు మించి ఏం కావాలి ? అని అడుగుతుంది సారా.
సెలబ్రిటీ ఫ్యామిలీ అయినా చిన్నప్పటి నుంచి నిరాడంబరంగా ఉండటం అంటేనే ఇష్టమట. ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛ గా ఉంటుందిట. నచ్చిన పుడ్ రోడ్డు మీద కనిపించినా తినేస్తుందిట. అలాగే నచ్చిన ఐటమ్ లు రోడ్డు పక్కన షాపులో కనిపించినా కారు దిగి కొనేస్తుందిట. హీరోయిన్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి ఎవరూ గుర్తు పట్టకుండా ఇవన్నీ చేసేస్తుందిట. ఇక కేధరనాధ్..బద్రీనాధ్ యాత్రలకు వెళ్లే సమయంలో సారా యాత్రికులతో ఇట్టే కలిసిపోతుంది.
వాళ్ల అడుగుల్లో అడుగులేసుకుని..వాళ్లతో పాటు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్లి దైవ దర్శనం చేసుకున్న సందర్భాల్లెన్నో. ఇక చిన్న పిల్లలు అంటే అంతే ఇష్టమట. వాళ్లు కనిపిస్తే వాళ్లను చేతుల్లోకి తీసుకుని ఆడించడం...వాళ్లతో కలిసి మాట్లాడటం వంటివి చేస్తుందిట. పటౌడీ వారసురాలిగా చిటికేస్తే అన్ని రకాల సౌకర్యాలు కళ్ల ముందు ఉంటాయి. కానీ వాటికి పూర్తి గా తాను భిన్నంగా ఉంటుందిట. అలా ఉండటమే తనకి ఇష్టమట. జీవితాన్ని ఎప్పుడు చాలా సింపుల్ గానే డిజైన్ చేసుకోవాలని..ఉన్నంతలో సంతోషంగా ఉండాలని అంటోంది.