Begin typing your search above and press return to search.

సన్నని నడుముతో మాయ చేస్తోన్న సిమ్రాన్ పాప

తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి హమ్ తుమ్ అనే సినిమా సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Oct 2024 9:30 AM GMT
సన్నని నడుముతో మాయ చేస్తోన్న సిమ్రాన్ పాప
X

తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి హమ్ తుమ్ అనే సినిమా సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక 2017లో ఫెమినా మిస్ తెలంగాణ టైటిల్‌ను గెలుచుకున్న అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఆ తరువాత మోడలింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించడం ద్వారా ఆమె కెరీర్ యూ టర్న్ తీసుకుంది. తర్వాత బొంబాట్, చెక్, పాగల్, సెహరి తదితర సినిమాలలో కనిపించింది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో సిమ్రాన్ చిన్న పాత్రలో మెరిసింది. అలాగే లవ్ మీ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. కానీ ఇప్పటివరకు గ్లామర్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. మరింత ప్రభావవంతమైన పాత్రలో నటించి తన ప్రతిభను ప్రూవ్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంది. సినిమాలతో పాటు మోడలింగ్‌లో కూడా రాణిస్తూ ఉంటుంది.

సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫోటోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులతో కలిసిపోతుంది. తన గ్లామరస్ ఫోటోషూట్‌లు, యాక్టివిటీస్ వైరల్ అవుతూ ఉంటాయి.

సిమ్రాన్ చౌదరి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఆమె సింప్లిసిటీ, గ్లామర్‌ ని హైలెట్ చేస్తున్నాయి. డెనిమ్ జీన్స్, సన్నని టాప్‌లో కూల్ లుక్‌లో కనిపిస్తూ, ఆమె నేచురల్ హ్యూమర్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. వర్షాన్ని ఆస్వాదిస్తూ మంచి క్యాప్షన్‌లతో రోజువారీ జీవితాన్ని ఆనందంగా ఎలా చూడాలో చెబుతోంది. ఈ పోస్టు మంచి స్పందన పొందుతూ, కామెంట్లలో ఆమె ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఒక తెలుగు సినిమాతో పాటు తమిళంలో కూడా చిన్న బడ్జెట్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఒక వెబ్ సీరిస్ ప్రాజెక్టుతో బిజీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే సిమ్రాన్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. మంచి సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని అనుకుంటోంది. మరి ఆమెకు వచ్చే అవకాశాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.