Begin typing your search above and press return to search.

బ్లాక్ గౌనులో సిమ్రాన్ గ్లామర్ టచ్.. వ్వాటే బ్యూటీ!

తాజాగా, వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Feb 2025 11:30 AM GMT
బ్లాక్ గౌనులో సిమ్రాన్ గ్లామర్ టచ్.. వ్వాటే బ్యూటీ!
X

తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. 2014లో ‘హమ్ తుమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్, 2017లో ఫెమినా మిస్ తెలంగాణ టైటిల్ గెలుచుకుని మోడలింగ్‌లో మంచి గుర్తింపు పొందింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో నటిగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. ఆ తరువాత ‘బొంబాట్’, ‘చెక్’, ‘పాగల్’, ‘సెహరి’, ‘అథర్వ’ వంటి సినిమాలలో నటించి టాలీవుడ్‌లో తన సత్తా చాటింది.


అయితే, వరుసగా కొన్ని సినిమాలు ఆశించిన రీతిలో ఆడకపోవడం వలన సిమ్రాన్ కొంత స్లో అయ్యింది. అయినా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు తన క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. తాజాగా, వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


ఈ ఫోటోషూట్‌లో సిమ్రాన్ బ్లాక్ బాక్‌లెస్ గౌన్‌లో స్టన్నింగ్ లుక్స్‌లో కనిపించింది. హాయిగా కురిసిన కురులు, క్యూట్ స్మైల్‌తో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. “ప్రేమించే సామర్థ్యం మీకు ఉంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి” అనే చార్లెస్ బుకోవ్స్కీ కోటేషన్‌తో ఈ ఫోటోలకు మరింత డెప్త్ తీసుకువచ్చింది. ఈ స్టిల్స్‌లో ఆమె నేచురల్ గ్లో, కళ్లలో కనిపించే ఆకర్షణ నెటిజన్లను ఫిదా చేసింది.


ఫ్యాన్స్ కామెంట్స్‌లో, “బ్లాక్ గౌన్‌లో బ్యూటిఫుల్ సిమ్రాన్”, “క్యూట్ అండ్ క్లాసీ లుక్” అంటూ పొగడ్తలతో కామెంట్స్ విరివిగా చేస్తున్నారు. కొందరు ఈ స్టిల్స్‌ను చూసి “బ్లాక్‌లో ఏంజెల్” అని కామెంట్ చేస్తున్నారు. ఆమె తన ఫోటోషూట్స్ ద్వారా ఎప్పుడు గ్లామర్ డోస్ చూపించడంలో సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం సిమ్రాన్ తెలుగు తమిళ సినిమాల కోసం చర్చలు జరుపుతుందనే వార్తలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తన ప్రెజెన్స్‌ను పెంచుకుంటూ, మళ్ళీ బిగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆమె ప్రయత్నం చేస్తోంది.