నా కుడి భుజాన్ని కోల్పోయా! సిమ్రాన్
ముఖ్యంగా పాత తరం హీరోయిన్లు చాలా మంది మేనేజర్ల అంటే ఫ్యామిలీ లో మెంబర్లలాగే భావిస్తుంటారు. తాజాగా వెటరన్ నటి సిమ్రాన్ మేనేజర్ ఎం.కామరాజన్ మృతితో ఆమె దిగ్భ్రాంతి గురయ్యారు.
By: Tupaki Desk | 10 Dec 2023 11:27 AM GMTఇండస్ట్రీలో హీరోయిన్ల మేనేజర్లు ఎంతటి కీలక పాత్రధారులో చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు అవకాశాలు రావడం వెనుక పరోక్షంగా వాళ్ల పాత్ర కూడా ఉంటుంది. ఆరంభంలో ప్రతిభతో అవకాశాలు దక్కించుకున్నా అటుపై చక్రం తిప్పేది అంతా మేనేజర్లు..కో ఆర్డినేటర్లే. ఏది మంచి అవకాశం? ఎలాంటి సినిమాలు చేయాలి? ఇలా అవసరమైన...విలువైన సలహాలు ఇస్తుంటారు. అయితే ఇదంతా హీరోయిన్-మేనేజర్ మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ని బట్టి ఉంటుంది. అలా హీరోయిన్లతో మంచి ప్రెండ్ షిప్ ని కలిగిన మేనేజర్లు ఎంతో మంది.
ముఖ్యంగా పాత తరం హీరోయిన్లు చాలా మంది మేనేజర్ల అంటే ఫ్యామిలీ లో మెంబర్లలాగే భావిస్తుంటారు. తాజాగా వెటరన్ నటి సిమ్రాన్ మేనేజర్ ఎం.కామరాజన్ మృతితో ఆమె దిగ్భ్రాంతి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పెట్టి కామరాజన్ తో తన స్నేహం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేసారు.`నమ్మలేకపోతున్నా. దిగ్భ్రాంతికరమైన వార్త. నా ప్రియమైన స్నేహితుడు ఎం. కామరాజన్ ఇక లేరు.
25 ఏళ్లుగా నా కుడి భుజంగా ఉన్నారు. నా ఎదుగుదలకు ఓ పిల్లర్‌లా నిలబడ్డారు. చాలా చురుకైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ.. ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేకుండా నా సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేను. ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’ అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఆ పోస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కామరాజన్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. సీనియర్ నటి సిమ్రాన్ గురించి పరిచయం అవసరం లేదు. చిరంజీవి.. బాలకృష్ణ ..వెంకటేష్..నాగార్జున లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. సిమ్రాన్ తరం హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆమెకి ముందు..తర్వాత అని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.