Begin typing your search above and press return to search.

సింగరో సింగ.. సాంగ్ లోనే 'స్వాగ్' తగ్గలేదంతే..!

స్వాగ్ సినిమాలో శ్రీవిష్ణు పాత్రని పరిచయం చేస్తూ సింగరో సింగ పాట వచ్చింది. సినిమాలో శ్రీవిష్ణు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా కనిపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   18 July 2024 1:04 PM GMT
సింగరో సింగ.. సాంగ్ లోనే స్వాగ్ తగ్గలేదంతే..!
X

తెలుగులో కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు శ్రీ విష్ణు. కెరీర్ మొదట్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన శ్రీవిష్ణు హీరోగా ప్రమోట్ అయ్యాక వెరైటీ కథలతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనింగ్ అందిస్తున్నాడు. శ్రీవిష్ణు సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అయ్యేలా తన సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా ఓం భీం బుష్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు లేటెస్ట్ గా స్వాగ్ అనే సినిమాతో రాబోతున్నాడు.

శ్రీవిష్ణుతో ఆల్రెడీ ఒక సినిమా తీసి సక్సెస్ అందుకున్న హర్షిత్ గోలి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాజ రాజ చోరతో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ హీరో కాంబో హర్షిత్ అండ్ శ్రీవిష్ణు ఈసారి డబుల్ కిక్ ఇచ్చేందుకు స్వాగ్ తో రాబోతున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా పోస్టర్స్ రాగా లేటెస్ట్ గా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ సింగరో సింగ సాంగ్ రిలీజ్ చేశారు. సింగరో సింగ అనే లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న స్వాగ్ సినిమాలో ఈ సాంగ్ ను బాబా సెహగల్, వైకొం విజయలక్ష్మి ఆలపించారు.

స్వాగ్ సినిమాలో శ్రీవిష్ణు పాత్రని పరిచయం చేస్తూ సింగరో సింగ పాట వచ్చింది. సినిమాలో శ్రీవిష్ణు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా కనిపించబోతున్నాడు. ట్రెండ్ కి తగినట్టుగా కథలు, పాత్రలతో శ్రీవిష్ణు చేస్తున్న అటెంప్ట్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. అందులో భాగంగానే వస్తున్న ఈ స్వాగ్ కూడా శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడేలా వస్తుంది.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాలో శ్రీ విష్ణు సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. క్వీన్ రుక్మిణి దేవి కూడా సినిమాలో భాగం అవుతుంది. స్వాగ్ సినిమాకు వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీవిష్ణు హిట్ స్వాగ్ ని ఈ స్వాగ్ మూవీ కూడా కొనసాగేలా చేస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం. డైరెక్టర్ హీరో హిట్ కాంబో కాబట్టి సినిమా అవుట్ పుట్ మీద చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీవిష్ణు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చాలా ఫోకస్ గా ఉన్నారు.