Begin typing your search above and press return to search.

నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం

మానసిక ఒత్తిడితో ఆమె ఈ నిద్ర మాత్రలను అధిక మోతాదులో మింగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2025 10:55 AM IST
నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం
X

ప్ర‌ముఖ గాయ‌ని క‌ల్ప‌న ప్రాణాపాయస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డింది. నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన ఆమె ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. హైద‌రాబాద్‌లోని నిజాంపేట‌లో ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ఆమెకు చికిత్స చేస్తున్నారు. జోల్‌ఫ్రెష్ అనే నిద్ర మాత్ర‌ల‌ను ఆమె వేసుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ కేసు విచార‌ణ‌ను కేపీహెచ్‌బీ పోలీసులు వేగంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. మంగ‌ళ‌వారం సాయంత్రం క‌ల్ప‌న అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అంశాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉండ‌డంతో నేడు త‌న వాంగ్మూలాన్ని పోలీసులు న‌మోదు చేయ‌నున్నారు. మానసిక ఒత్తిడితో ఆమె ఈ నిద్ర మాత్రలను అధిక మోతాదులో మింగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే క‌ల్ప‌న ప్ర‌స్తుతం రెండో భ‌ర్త ప్ర‌సాద్‌తో క‌లిసి నిజాంపేట‌లోని ఒక గేటె9డ్ క‌మ్యూనిటీలో నివాసం ఉంటుంది. రెండో భ‌ర్త వృత్తి రీత్యా కొద్దిరోజుల‌ కింద‌ట చెన్నై వెళ్లాడు. క‌ల్ప‌న‌కు ఆయ‌న ఫోన్ చేస్తుంటే ఆమె స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన భ‌ర్త పొరుగింటి వారికి ఫోన్ చేసి ఒక‌సారి చూడ‌మ‌ని చెప్పాడు. కాలింగ్ బెల్ ఎన్నిసార్లు కొడుతున్నా స్పందించ‌లేద‌ని ప్ర‌సాద్‌కి వారు తెలిపారు.

దీంతో విష‌యాన్ని క‌మ్యూనిటీ సెక్ర‌ట‌రీకి ప్ర‌సాద్ తెలియ‌జేశారు. ఆయ‌న పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చాడు. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఇంటి వెనుక త‌లుపును ప‌గ‌ల‌గొట్టి లోప‌ల‌కి వెళ్లి చూడ‌గా మొద‌టి అంత‌స్తు బెడ్ రూమ్‌లో క‌ల్ప‌న అప‌స్మార‌క స్థితిలో క‌న్పించ‌డంతో వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మొద‌టి భ‌ర్త వ‌ల్లే క‌ల్పన నిద్ర‌మాత్ర‌లు మింగేద‌నే కోణంలో ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, పెద్ద కూతురుతో క‌ల్ప‌న‌కు ఈ మ‌ధ్య ఫోన్‌లో గొడ‌వైంద‌ని రెండో భ‌ర్త ప్ర‌సాద్ పోలీసుల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. కేర‌ళ‌లో ఉంటున్న పెద్ద కూతురును అక్క‌డి నుంచి వ‌చ్చి హైద‌రాబాద్‌లో ఉండ‌మ‌ని క‌ల్ప‌న అడుగుతుంటే ఆమె అందుకు ఒప్పుకోవ‌డం లేదని, దీంతో ఫోన్‌లో ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ని తెలుస్తోంది.