Begin typing your search above and press return to search.

స్టార్ హీరో విడాకుల్లో ఊహించ‌ని కొత్త‌ డ్రామా

త‌మ మ‌ధ్య ఫిజిక‌ల్ బాండింగ్ లేద‌ని స్ప‌ష్ఠం చేయ‌డ‌మే గాక‌ అత‌డు త‌న క్ల‌యింట్ అని థెర‌పిస్ట్ (వైద్యురాలు) అయిన కెనీషా తెలిపారు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 6:22 AM GMT
స్టార్ హీరో విడాకుల్లో ఊహించ‌ని కొత్త‌ డ్రామా
X

భార్య ఆర్తి నుండి త‌మిళ స్టార్ హీరో జయం రవి విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విడిపోయిన భార్యాభర్తలిద్దరూ ఇప్పుడు సోషల్ మీడియాల వేదిక‌గా ఒక‌రితో ఒక‌రు గొడవ పడుతుండడంతో అది బ‌హిరంగంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గోవాకు చెందిన గాయని కం వైద్యురాలు కెనిషా ఫ్రాన్సిస్ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మ‌ని పుకార్లు వ‌చ్చాయి. ఇటీవల ఈ పుకార్లను ఉద్దేశించి జ‌యం ర‌వి స్ప‌ష్ఠంగా మాట్లాడాడు. అంతేకాదు.. గాయ‌ని కెనీషా కూడా దీనిపై స్ప‌ష్ఠ‌త‌నిచ్చింది. త‌మ మ‌ధ్య ఫిజిక‌ల్ బాండింగ్ లేద‌ని స్ప‌ష్ఠం చేయ‌డ‌మే గాక‌ అత‌డు త‌న క్ల‌యింట్ అని థెర‌పిస్ట్ (వైద్యురాలు) అయిన కెనీషా తెలిపారు.

భార్య వ‌ల్ల స‌త‌మ‌త‌మైన జ‌యం రవికి చికిత్స అందించాన‌ని కెనీషా ఇటీవ‌లి ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. భార్య ఆర్తి, అత్త‌మామ‌ల‌తో అత‌డు చాలా ఇబ్బంది ప‌డ్డాడ‌ని, త‌న త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని ఆర్తి భ‌య‌ప‌డి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని కెనీషా వ్యాఖ్యానించారు. డిటి నెక్స్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గాయని కెనీషా ఎఫైర్ పుకార్లను కొట్టిపారేసింది. అతడు తన క్లయింట్ అని భార్య వ‌ల్ల మానసికంగా గాయపడడంతో అతడికి సహాయం చేస్తున్నాన‌ని కెనీషా స్ప‌ష్ఠంగా పేర్కొంది. ఆర్తి అత‌డిపై గృహహింసకు పాల్పడ్డారని ఆరోపించింది.

జ‌యం ర‌వి తన లాయర్ ద్వారా పరస్పర అంగీకారంతో విడాకుల నోటీసు పంపిన తర్వాతే నా వద్దకు వచ్చాడు. ఈ విషయం చెన్నైలో ఎవరికీ తెలియకూడదనుకోవడంతో అతను నన్ను సంప్రదించాడు. ఆ త‌ర్వాత వైద్య చికిత్స కొన‌సాగించాన‌ని కెనీషా వెల్ల‌డించారు. మాన‌సికంగా గాయ‌ప‌డిన జ‌యం ర‌వి చికిత్స కోసం కెనీషాను సంప్ర‌దించాడని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన `పొన్నియ‌న్ సెల్వ‌న్` ఫ్రాంఛైజీలో జ‌యం ర‌వి న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి త‌ని ఒరువ‌న్ సీక్వెల్ లో న‌టించాల్సి ఉండ‌గా, ప్ర‌స్తుతం అత‌డు ఫ్యామిలీ బ్యాటిల్ ని ఎదుర్కొంటున్నాడు. ఇది జ‌యం ర‌విని తీవ్రంగా డిస్ట్ర‌బ్ చేసింద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది.