హీరోతో ఎఫైర్ పుకార్లను ఖండించిన గాయని
అదంతా అటుంచితే, బెంగళూరు గాయని కెనిషా ఫ్రాన్సిస్ తో ఎఫైర్ వల్లనే జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 25 Sep 2024 5:56 AM GMTతమిళ హీరో, 'తని ఒరువన్' ఫేం జయం రవి విడాకుల ప్రకటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కానీ దీనికి భార్య ఆర్తి అంగీకరించలేదు. సమస్యను పరిష్కరించుకుంటామని పెద్దలతో మాట్లాడుతానని అన్నారు. తన సమ్మతి లేకుండా విడాకుల ప్రక్రియ జరగదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఆర్తికి ఇప్పటికే నోటీసులు పంపానని, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాననని అందువల్లనే తాను పబ్లిక్ గా విషయాన్ని ప్రకటించానని జయం రవి అన్నారు.
అదంతా అటుంచితే, బెంగళూరు గాయని కెనిషా ఫ్రాన్సిస్ తో ఎఫైర్ వల్లనే జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాల్లో పెద్ద డిబేట్ నడుస్తుండగా, గాయని గురించి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ జయం రవి తనపై వస్తున్న అన్ని పుకార్లను కొట్టి పారేసాడు. గాయనిని ఇందులోకి లాగొద్దని అభ్యర్థించాడు. అన్ని ఆధారాలతో కోర్టులో పరిష్కారం కోరుతున్నానని జయం రవి అన్నారు.
అలాగే తనపై వస్తున్న పుకార్ల గురించి గాయని కెనిషా ఇప్పటికే సోషల్ మీడియాల్లో స్పందించారు. మీడియా ముఖంగా దీనిపై స్పందించనని కూడా వెల్లడించారు. కెనీషా ఇలాంటి పుకార్లను నమ్మొద్దని ప్రజల్ని కోరారు. ఇతరుల సమస్యలను మీవిగా చేసుకోవడానికి స్వేచ్ఛను తీసుకున్న మీ అందరికీ నేను ఒక వినయపూర్వకమైన అభ్యర్థనను విజ్ఞప్తిని చేస్తున్నాను. ముందుగా వినయపూర్వకంగా నేను మీకు ఇది చెప్తున్నాను. దీనికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఇంటి సమస్య కాదు.. మరొకరిది. మీరు ఈ విషయంలో ఒక అభిప్రాయానికి అర్హులు కాదు.. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దయగా ఉండవలసిన అవసరం ఉందని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంపై నేను ఏ ఇతర మీడియాతో మాట్లాడను'' అని ఆర్తి అన్నారు.
గాయని కెనిషా క్రిప్టిక్ పోస్టులు కొన్ని ఇప్పటికే వైరల్ అయ్యాయి. మర్యాద, గౌరవం లేకుండా నన్ను భయంకరమైన ప్రశ్నలు అడిగే అందమైన వ్యక్తులందరికీ నా దగ్గర సమాధానం ఉంది. ఇది ఇప్పుడు మీ హృదయాన్ని మనస్సును శాంతపరుస్తుందని ఆశిస్తున్నాను.. గాయం ఒక వ్యక్తిని బలవంతం చేయదని పేర్కొంది. కొన్ని గాయాలు వారిని మరింత సున్నితంగా అసురక్షితంగా చేస్తాయి.. వారు మరింత సులభంగా ఏడుస్తారు.. చిన్న విషయాలకే సింక్ అయిపోతారు. గాయం మిమ్మల్ని బలపరుస్తుంది అనే కథనం అబద్ధం! అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది కేష. మరొక నిగూఢ సందేశం ఇలా ఉంది. ''ప్రజల హృదయాలపై మచ్చలు చాలా వరకు వారి శత్రువులు వదిలిపెట్టలేదు. వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారని చెప్పుకునే వ్యక్తులు వదిలిపెట్టారు'' అని కూడా వ్యాఖ్యను జోడించారు.
కెనిషాతో తనకు సంబంధం ఉందనే పుకార్లను జయం రవి ఖండించారు. సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న నా పేరు, కీర్తి అంత సులభంగా దెబ్బతినడానికి నేను అనుమతించను. భార్య ఆర్తితో అలాగే ఇరు కుటుంబాల మధ్య చర్చల తర్వాతే విడాకుల నోటీసు పంపామని, ప్రొసీడింగ్స్ గురించి తెలియదన్న ఆర్తి వాదనకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. నోటీస్ పంపే ముందు నేను నా లాయర్ ద్వారా ఆమె తండ్రితో మాట్లాడాను. మా తల్లిదండ్రులు ఇద్దరూ ఈ విషయం గురించి ఇప్పటికే చర్చించారు'' అని అతను వివరించాడు. అనేక మంది డిప్రెషన్‌ను అధిగమించడంలో సహాయపడిన గాయని .. మనస్తత్వవేత్తగా ఆమె నాకు తెలుసు. మేము కలిసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని తెరవాలని ప్లాన్ చేస్తున్నాము! అని కూడా జయం రవి స్పష్ఠతనిచ్చారు.
ఎవరు ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నారో నాకు తెలియదు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని కోర్టులో సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. న్యాయ ప్రక్రియ ద్వారా నిజం బయటకు వస్తుంది అని కూడా జయం రవి అన్నారు. 15 సంవత్సరాల సాహచర్యం తర్వాత ఆర్తి నుండి విడిపోతున్నట్లు జయం రవి ప్రకటించాడు. చాలా ఆలోచించిన తర్వాత, వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.