ఆస్కార్ గ్రహీతకు చెత్త రికార్డ్.. ఫ్యాన్స్ ఆగ్రహం
కార్యక్రమ నిర్వాహకుల పట్ల రెహమాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈవెంట్ నిర్వాహకులు గతంలో అనుభవం లేనట్లుగా వ్యవహరించారు
By: Tupaki Desk | 11 Sep 2023 5:37 AM GMTప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తాజాగా చెన్నైలోని ఆదిత్య రామ్ ప్యాలెస్ లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. రెహమాన్ షో అనగానే అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరడం జరుగుతుంది. అలాంటిది చెన్నై లో అవ్వడంతో మరింతగా ఆ కార్యక్రమానికి డిమాండ్ ఏర్పడింది.
రహమాన్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కార్యక్రమ నిర్వహకులు కెపాసిటీ కంటే కూడా ఎక్కువగా అధిక మొత్తం లో రేట్లకు టికెట్లు అమ్మడం జరిగింది. టికెట్లు కొనుగోలు చేసిన వారిలో చాలా మంది కార్యక్రమం కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక లోనికి వెళ్లే సమయంలో చాలా మంది తొక్కిసలాట కారణంగా గాయాల పాలు అయ్యారు.
భారీ ఎత్తున జనాలు ఉండటంతో ఆ జనాల్లో మహిళల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించడం జరిగిందట. ఇలా ఎన్నో రకాలుగా కార్యక్రమం కు చెత్త రికార్డు గా నమోదు అయింది. ఈ కచేరి ఇప్పటి వరకు రహమాన్ పాల్గొన్న కార్యక్రమాల్లో అత్యంత చెత్త కార్యక్రమం గా, నిర్వహణ చెత్తగా నిలుస్తుందని స్వయంగా ఆయన అభిమానులు అంటున్నారు.
కార్యక్రమ నిర్వాహకుల పట్ల రెహమాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈవెంట్ నిర్వాహకులు గతంలో అనుభవం లేనట్లుగా వ్యవహరించారు. వారు కేవలం డబ్బు కోసం అన్నట్లుగా కార్యక్రమంను నిర్వహించారని చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కారణంగా రెహమాన్ పరువు పోయినట్లయింది.
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ షో అనగానే లక్షలాది మంది అభిమానులు లైవ్ లో చూడ్డానికి ఆసక్తి చూపిస్తారు. అంత మాత్రాన ఎంత మందికి పడితే అంత మందికి టికెట్లు ఇవ్వడం తో పాటు ఇలా చెత్తగా ఏర్పాట్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియా ద్వారా నిర్వాహకులను మరియు రెహమాన్ ను లక్షలాది మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు.