సమంత ఆత్మ పై హైదరాబాద్ లో కేసు
అయితే సమంత సినిమాలో వినిపించే వాయిస్ ఆమె సొంత వాయిస్ కాదు.. సింగర్ చిన్మయి వాయిస్ అనే విషయం అందరికి తెల్సిందే
By: Tupaki Desk | 29 Feb 2024 9:44 AM GMTస్టార్ హీరోయిన్ సమంత కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం తో అలరించడం తో పాటు ఆమె వాయిస్ కూడా ఎంతో మందికి అభిమానం. అయితే సమంత సినిమాలో వినిపించే వాయిస్ ఆమె సొంత వాయిస్ కాదు.. సింగర్ చిన్మయి వాయిస్ అనే విషయం అందరికి తెల్సిందే.
అందుకే సింగర్ చిన్మయిని సమంత యొక్క ఆత్మ అన్నట్టుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చిన్మయి వాయిస్ వల్లే సమంతకు అంతటి గుర్తింపు మరియు ఫాలోయింగ్ అంటూ కామెంట్స్ చేసే వారు చాలా మంది ఉంటారు. అలాంటి చిన్మయి పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది.
తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో చిన్మయి మాట్లాడుతూ ఇలాంటి దేశంలో పుట్టడం నా కర్మ, ఇది ఒక స్టుపిడ్ కంట్రీ అన్నట్లుగా తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది.
చిన్మయి వ్యాఖ్యలు కచ్చితంగా దేశం గురించి తప్పుగా మాట్లాడిన వ్యాఖ్యలుగా పరిగణలోకి తీసుకోవాల్సిందే అంటూ హెచ్‌సీయూ విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. చిన్మయి తన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.