Begin typing your search above and press return to search.

రిలేష‌న్ షిప్ త‌ర్వాతే పెళ్లి అంటోన్న సింగర్!

ప్రేమ‌..పెళ్లి విష‌యాల్లో ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడంతా రిలేష‌న్ షిప్ త‌ర్వాత పెళ్లి అంటు న్నారు

By:  Tupaki Desk   |   3 Oct 2023 5:30 PM GMT
రిలేష‌న్ షిప్ త‌ర్వాతే పెళ్లి అంటోన్న సింగర్!
X

ప్రేమ‌..పెళ్లి విష‌యాల్లో ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడంతా రిలేష‌న్ షిప్ త‌ర్వాత పెళ్లి అంటు న్నారు. రిలేష‌న్ షిప్ స‌క్ర‌మంగా న‌డిస్తే వివాహ బంధంతో ఒక‌ట‌వుతున్నారు. లేదంటే! ఆ బంధానికి అక్క‌డితో పుల్ స్టాప్ పెట్టి ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. చాలా మంది న‌టీమ‌ణులు ఈప్రాస‌స్ కే పెద్ద పీట వేస్తున్నారు. వివాహం చేసుకుని గొడ‌వ‌లు ప‌డి విడిపోవ‌డం కంటే రిలేష‌న్ షిప్ లోనే తామెంటో అర్దం చేసుకుని ముందుకెళ్ల‌డం మంచిదంటున్నారు.


తాజాగా టాలీవుడ్ హాట్ సింగ‌ర్..బిగ్ బాస్ కంటెంట‌స్ట్ దామిని భ‌ట్ల‌ ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది.' నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని ఉంది. అటుపై కొన్నాళ్ల పాటు స‌హ‌జీవనం చేయాలి. ఆత‌ర్వాత పెళ్లి చేసుకుంటా. ఈ కాలంలో స‌హ‌జీవ‌నం త‌ప్పేంకాదు. ఒక‌ర్ని ఒక‌రు అర్దం చేసుకోవ‌డానికి అదొక మంచి వేదిక‌. అయినా నా విష‌యంలో ఈ స‌హ‌జీవ‌నం కూడా అమ్మ‌నాన్న అనుమ‌తితో చేయాల‌నుకుంటున్నా.

నేను ఏ ప‌నిచేసినా వాళ్ల‌కి చెప్పే చేస్తా. ఈ విష‌యంలో కూడా వాళ్ల అనుమ‌తి తీసుకుంటా. న‌చ్చిన వ్య‌క్తి ఇంకా తార‌స‌ప‌డ‌లేదు. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు' అని తెలిపింది. రాజమండ్రిలో పుట్టి పెరిగిన దామిని కుటుంబ తర్వాత రోజుల్లో హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. చిన్న‌వ‌య‌సులోనే సంగీతంపై ఆస‌క్తి పెంచుకుంది . చ‌దువు...సింగింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చింది.

2011 లో పాడుతా తీయగా షోలో రెండో స్థానంలో నిలిచింది. అటుపై స్టేజి షోలు.. ప్రైవేట్ ఆల్బమ్స్.. ప్రైవేట్ బ్యాండ్.. సినిమాల్లో పాట‌ల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. 'కొండపొలం' సినిమాలోని 'ధమ్ ధమ్' పాటకు బెస్ట్ లిరిక్స్ నేషనల్ అవార్డు కూడా వ‌చ్చింది. ఆ పాట ఆల‌పించింది దామిని భ‌ట్లనే. ప్ర‌స్తుతం బిగ్ బాస్-7లో దామిని పాల్గొన్న సంగతి తెలిసిందే.