Begin typing your search above and press return to search.

గాయ‌ని పాదాలకు న‌మ‌స్క‌రించిన స్టార్ హీరో!

బాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత ఓపెన్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి ఎమోష‌న్ అయినా అప్ప‌టిక‌ప్పుడు ఓపెన్ అయిపోవాల్సిందే.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:03 AM GMT
గాయ‌ని పాదాలకు న‌మ‌స్క‌రించిన స్టార్ హీరో!
X

బాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత ఓపెన్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి ఎమోష‌న్ అయినా అప్ప‌టిక‌ప్పుడు ఓపెన్ అయిపోవాల్సిందే. బుల్లి తెర వేదిక‌ల‌పై ఎంతో మంది స్టార్ హీరోలు ప్ర‌తిభావం తుల్ని కీర్తిస్తు హ‌గ్ చేసుకున్న సంద‌ర్భాలెన్నో ఉన్నాయి. తాజాగా ఈ ఘ‌ట‌న మాత్రం అంత‌కు మంచి అంద‌రి హృద‌యాల్ని పండేసింది. అత‌ను ఇంత‌గా చ‌లించిపోతాడా? అన్న ఓ ఘ‌ట‌న ఓ షోలో చోటు చేసుకుంది వివ‌రాల్లోకి వెళ్తే..

`ఇండియన్ ఐడల్ సీజన్ 14` లో `షాందార్ పరివార్` టెలికాస్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోకు బాలీవుడ్ నుంచి ర‌ణ‌బీర్ క‌పూర్..ర‌ష్మిక మంద‌న్నా `యానిమ‌ల్` ప్ర‌మోష‌న్ లో భాగంగా హాజ‌ర‌య్యారు. అక్క‌డ ఓ కంటెంస్టెంట్ విష‌యంలో ర‌ణ‌బీర్ అంద‌రి హృద‌యాల్ని ఒక్క‌సారిగా తాకాడు. తాజాగా ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంధ గాయ‌ని పెర్పార్మెన్స్ న‌చ్చ‌డంతో ర‌ణ‌బీర్ వేదిక‌పై కి వెళ్లి ఆమె పాదాల‌కు నమ‌స్క‌రించాడు.

ఆమె ప్ర‌తిభ‌ని కొనియాడుతూ తానెంత‌గా ఎంజాయ్ చేసాడో రివీల్ చేసాడు. సోనీ టీవీ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేయ‌డం ఈ సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మేనుక పౌదేల్ అనే అంధ గాయని రణ్‌బీర్ కపూర్ న‌టించిన పాట `అగర్ తుమ్ సాత్ హో` ను ఆలపించారు. ఆ పాట‌ని ఎంతో అద్భుతంగా అల‌పిం చ‌డంతో ర‌ణ‌బీర్ ఫిదా అయ్యాడు. పాట పూర్తికాగానే ర‌ష్మిక‌తో స్టేజ్ మీద‌కు వెళ్లి అలా చేసాడు.

`మేనుక గారు.. నా పేరు రణ్‌బీర్. నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ పాటను శ్రేయా గారు మొదటి సారి పాడినప్పుడు అందరికీ ఇదే ఫీలింగ్ కలిగింది. శ్రేయా గారిని దేవత అని అంటారు. ఇప్పుడు ఇంకో దేవత మా ముందు సాక్షాత్కరించారు` అని రణ్‌బీర్ ఆనందం వ్య‌క్తం చేసారు. అటుపై మేనుక ` మీరు చాలా క్యూట్ గా ..హ్యాండ్ స‌మ్ గా ఉంటార‌ని విన్నాను. కాబ‌ట్టి మీ కుమార్తె కూడా ముద్దుగా ఉంటుంది.

ఆమెతో మీరు ఉన్న‌ప్పుడు ఎలాంటి పాట పాడుతారు? అని అడిగారు. దానికి ర‌ణ‌బీర్..రెండు పాట‌లు పాడ‌తాను అందులో ఒక‌టి బేబి షార్క్...ఈ పాట ఇబ్బంది ఉంటుంది కానీ చిన్న‌పిల్ల‌లు ఇష్ట‌ప‌డుతు న్నారు. కాబ‌ట్టి పాడుతున్నాను. మ‌రొక‌టి `లల్లా లల్లా లోరి’ పాట పాడుతా అన్నారు. ఇంత‌లో అంద‌మైన సింగ‌ర్ శ్ర‌యోఘోష‌ల్ లైన్ లోకి వ‌చ్చి అచ్చంగా నేను కూడా ర‌ణ‌బీర్ లాగే చేస్తాను అని అన్నారు. ఈ స‌ర‌దా సంభాష‌ణ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.