Begin typing your search above and press return to search.

పాపుల‌ర్ గాయ‌ని విర‌హం మామూలుగా లేదు!

ఝుమ్కా సింగర్ జోనితా గాంధీ బీచ్ వెకేష‌న్ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. పింక్ బికినీలో జోనితా అగ్గి రాజేసింది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 3:38 AM GMT
పాపుల‌ర్ గాయ‌ని విర‌హం మామూలుగా లేదు!
X

ఝుమ్కా సింగర్ జోనితా గాంధీ బీచ్ వెకేష‌న్ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. పింక్ బికినీలో జోనితా అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ని ఫ్యాన్స్ వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.


వాట్ ఝుమ్కా? పాట‌తో ఆమె పేరు మార్మోగింది. అటుపై దిల్ కా టెలిఫోన్ 2.0, దేవా దేవా లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో అల్లాడించింది. వీటిని పాడింది ఎవ‌రో తెలుసా? గాయ‌ని జోనితా గాంధీ చార్ట్‌బస్టర్ పాటలు ఇవి. జనాల్లో సంచలనంగా మారాయి. బహుముఖ ప్ర‌తిభావ‌ని, గాయని జోనితా తన స్వరంతో ప్రజ్ఞతో వేవ్స్ క్రియేట్ చేస్తోంది. ఎఆర్ రెహమాన్ - ప్రీతమ్ వంటి దేశంలోని ప్రముఖ సంగీత స్వరకర్తల కోసం పాడిన జోనితా గాంధీ తన కెరీర్ జ‌ర్నీని అద్భుతంగా సాగిస్తున్నారు. ప్రాంతీయ సినిమా నుండి బాలీవుడ్ వరకు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, వెస్ట్రన్, పాప్, EDM .. మరెన్నో శైలులను కలిగి ఉన్న వైవిధ్యమైన డిస్కోగ్రఫీతో జోనిత పేరు మార్మోగుతోంది. దానికి తోడు జోనిత తన ప్రత్యేకమైన ఇండిపెండెంట్ సంగీత కచేరీలతోను పాపుల‌రైంది.


జోనితా సోష‌ల్ మీడియాల్లోను జ‌రంత స్పీడ్ గానే ఉంటుంది. తాజాగా త‌న స్నేహితురాలితో క‌లిసి ఓ బీచ్ వెకేష‌న్ లో బికినీ షో చేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలో హీట్ పెంచాయి. జోనిత ఈ ఫోటోగ్రాఫ్స్ లో ఎంతో వేడిగా క‌నిపిస్తోంది. పింక్ బికినీ ధ‌రించిన జోనితా బీచ్ ప‌రిస‌రాల్లో సాఫ్ట్ డ్రింక్ సేవిస్తూ క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

గాయని జోనితా ఇటీవల తన పుట్టినరోజును జరుపుకుంది. జోనిత తన కెరీర్ పథం గురించి AR రెహమాన్ -ప్రీతమ్ వంటి దిగ్గజాలతో తనకున్న అనుబంధం, ఇండిపెండెంట్ సంగీతం పట్ల తనకున్న అభిరుచి గురించి మాట్లాడింది. ప‌రిశ్ర‌మ‌లో నా పని పట్ల చాలా మంది ప్రశంసలు పొందినందుకు నేను ఖచ్చితంగా కృతజ్ఞురాలిని.. ఈ పరిశ్రమలో అస్థిరతను నేను గుర్తించాను. ఎల్లప్పుడూ హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి నేను మంచి- చెడు రెండింటినీ తీసుకుంటాను! నా హిట్ సినిమా పాటలకు నేను అందుకున్న ప్రశంసలు.. సినిమా సంగీతానికి వెలుపల నేను చేస్తున్న అన్ని పనులకు కూడా విస్తరించాలని నేను ఆశిస్తున్నాను!.. అని అన్నారు.