25 వేల కోట్ల ఆస్తులతో వరల్డ్ No.3 గాయని
నాలుగు దశాబ్ధాల చరిత్రలో టీవీ మూవీ రంగంలో పని చేసిన ప్రముఖ గాయని 24,856 కోట్ల ఆస్తులను కూడగట్టింది.
By: Tupaki Desk | 18 March 2024 4:31 AM GMTనాలుగు దశాబ్ధాల చరిత్రలో టీవీ మూవీ రంగంలో పని చేసిన ప్రముఖ గాయని 24,856 కోట్ల ఆస్తులను కూడగట్టింది. 12 ఆల్బమ్‌లు, వందల సినిమాలు.. టెలివిజన్ ప్రదర్శనలు... ప్రకటనలతో ఇంత పెద్ద మొత్తాన్ని ఆర్జించింది. అధిక ప్రచారం పొందిన పన్ను ఎగవేత కేసు .. ఇప్పుడు స్కైలైన్ లో ఒక ఎత్తైన కాంస్య విగ్రహం నిర్మాణంతో ఆమె పేరు ఇటీవల మార్మోగుతోంది. ఇంతకీ సదరు గాయని పేరేమిటి? అంటే...యువతరం వెంటనే గుర్తించే పాప్ గాయని షకీరా గురించే ఇదంతా. బోల్డ్ అండ్ డస్కీ పాప్ సింగర్ గా షకీరాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు వీరాభిమానులున్నారు.
అయితే ఇన్నేళ్ల కెరీర్ లో గాయని కం మోడల్ షకీరా ఎంత సంపాదించింది? సదరు పాప్ గాయని నికర ఆస్తుల విలువ ఎంత? ఆమె ఆదాయం ఏఏ మార్గాల్లో వస్తుంది? అంటూ ఆరా తీస్తే తెలిసిన సంగతులివి.
షకీరా అత్యంత భారీ ఆస్తులు కలిగి ఉన్న టాప్ 3 గాయనిగా రికార్డులకెక్కింది. లాటిన్ అమెరికా( U.S) సహా ఇతర ప్రాంతాలలో భారీ ప్రజాదరణ కలిగిన పాప్ గాయని. నిజానికి బెల్లీ-డ్యాన్స్ కాంట్రాల్టో ప్రముఖ పాప్ గాయని క్వీన్ గ్లోరియా ఎస్టీఫాన్ తర్వాత లాటిన్-అమెరికాలో జన్మించిన రెండవ అత్యంత సంపన్నమైన పాప్ గాయని. ఎస్టీఫాన్ నిజానికి యువ షకీరా బ్రేక్‌అవుట్ ఆల్బమ్ `లాండ్రీ సర్వీస్`ని ఆంగ్లంలోకి అనువదించడంలో సహకరించారు. తన ఎదుగుదలకు సాయపడ్డారు.
13 సంవత్సరాల వయస్సులో తన మొదటి రికార్డ్‌ను విడుదల చేసినప్పటి నుండి షకీరా దశాబ్దాలుగా స్పానిష్ - ఇంగ్లీష్ రెండింటిలోనూ ఆల్బమ్‌లను రికార్డ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శన ఇచ్చింది. 40+ సంవత్సరాల కెరీర్‌లో లాటిన్ పాప్ సంగీతాన్ని అమెరికన్ ప్రధాన స్రవంతిలోకి చేర్చడంలో సహకరించింది. కరోల్ G, బాడ్ బన్నీ వంటి భారీ ప్రజాదరణ పొందిన మోడ్రన్ ఆల్బమ్స్ తదుపరి గమ్యానికి చేరుకోవడానికి షకీరాకు మార్గం సుగమం చేసాయి.
రెండు భారీ విగ్రహాలు:
2023 చివరలో బారన్‌క్విల్లా బేర్‌ఫుట్ బెల్లీ డ్యాన్సర్ సంస్థ షకీరా 21 అడుగుల పొడవైన కాంస్య విగ్రహాన్ని నగరం వాటర్‌ఫ్రంట్‌లో ఆవిష్కరించింది. ఈ విగ్రహాన్ని నగర మాజీ మేయర్ సమక్షంలో ఇతర నాయకులు కలిసి ఆవిష్కరించారు. డిసెంబర్ 2023లో షకీరా 21-అడుగుల పొడవైన బీచ్‌సైడ్ కాంస్య విగ్రహం ఆమె కొలంబియన్ స్వస్థలమైన బారాన్‌క్విల్లాలో ఆవిష్కరించారు. దీంతో నగరం స్కైలైన్‌లో షకీరా శాశ్వతంగా నిలిచింది. లాటిన్ అమెరికా వారసత్వంలో ఎప్పటికీ మరపురాని విధంగా తన పేరు సుస్థిరం అయింది.
షకీరా నికర ఆస్తి విలువ ఎంత?
2023 చివరలో స్పానిష్ మ్యాగజైన్ `మార్కా` అందించిన కథనం ప్రకారం.. షకీరా నికర ఆస్తుల విలువ 300 మిలియన్ డాలర్లు. ఫోర్బ్స్‌ను ఫిగర్ అని కూడా ప్రస్థావించింది. పాప్ గాయకురాలిగానే కాకుండా చాలా మార్గాల్లో షకీరాకు ఆదాయం వస్తోందని కూడా ఈ జాబితా వెల్లడించింది. నిజానికి పాప్ గాయని గ్లోరియా ఎస్టీఫాన్ 500 మిలియన్ డాలర్లతో .. పాప్ గాయని జెన్నిఫర్ లోపెజ్ 400 మిలియన్ డాలర్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత షకీరా మూడవ అత్యంత ధనిక లాటినా పాప్ స్టార్‌గా నిలిచింది. ఎస్టీఫాన్ తర్వాత రెండవ అత్యంత ధనిక లాటిన్-అమెరికన్ పాప్ గాయనిగా షకీరా రికార్డులకెక్కింది. జెన్నిఫర్ లోపేజ్ న్యూయార్క్‌లో జన్మించారు.
సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది?
షకీరా వంటి ఎంటర్‌టైనింగ్ ట్యాలెంట్‌కు సాధారణ జీతాలు తీసుకునే ప్రొఫెషనల్స్ లాగా ఇంత వస్తుంది అంత వస్తుంది అనేది ఊహించలేం. దానికి బదులుగా ప్రతి సంవత్సరం ఆల్బమ్ అమ్మకాలు, రాయల్టీలు, సినిమాలు, టెలివిజన్ ప్రదర్శనలు, స్ట్రీమింగ్ రాబడి సహా ఇతర ఆదాయ వనరులపై ఆధారపడి వార్షిక గణాంకాలను రూపొందిస్తుంటారు. షకీరా ఆదాయాలు సంవత్సరాలుగా కొంచెం హెచ్చుతగ్గులకు లోనయినా తన ఆస్తులు మాత్రం తగ్గలేదు.
జూన్ 2018 నుండి జూన్ 2019 వరకు షకీరా 35 మిలియన్ డాలర్లు ఆర్జించి అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా సంగీతకారులలో 10వ స్థానంలో ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. బిల్‌బోర్డ్ ప్రకారం.. ఆమె మొదటి 10 స్థానాల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు. అయితే - 2012లో షకీరా 10వ స్థానానికి చేరింది. బిల్‌బోర్డ్ ప్రకారం ఆ ఏడాది 20 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించింది. 2023లో బిల్‌బోర్డ్ ప్రకారం.. షకీరా ఎప్పటికప్పుడు అత్యధిక వసూళ్లు చేసిన లాటిన్ కళాకారిణిగా 16వ స్థానం కట్టబెట్టారు.
కచేరీలు పర్యటనల ఆదాయం?
షకీరా సంపదలో ఎక్కువ భాగం ప్రపంచ పర్యటనల నుండి వస్తుంది. ఈ సమయంలో ఆమె కొన్నిసార్లు నృత్యం సహా లైవ్ గానానికి ఆసక్తి చూపుతుంది. ఈ తరహా షోల్లో అభిమానులతో నిండిన భారీ స్టేడియంలు వేదికల ప్రదర్శనలను ఎంచుకుంటుంది. పోల్‌స్టార్ 2020 నివేదిక ప్రకారం.. షకీరా తన 190 షోలలో 2.7 మిలియన్ టిక్కెట్‌లను విక్రయించింది. ఈ షో ద్వారా 2000 మరియు 2020 మధ్య రూ.189 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇది ఆ కాలంలో టూరింగ్ రాబడి ద్వారా ర్యాంక్ పొందిన మహిళా సంగీతకారుల జాబితాలో 19వ స్థానంలో నిలిచింది. 2023లో బిల్‌బోర్డ్ 120 షోలలో 108.1 మిలియన్ డాలర్లు ఆర్జించింది. నిరాడంబరమైన టూరింగ్ రాబడి ఇది అని బిల్ బోర్డ్ నివేదించింది.
2003లో మెక్సికో సిటీలోని ఫోరో సోల్‌లో వాలెంటైన్స్ డే సందర్భంగా షకీరా ఒక్క షో ద్వారా 4 మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది. 15 సంవత్సరాల తరువాత 2018లో షకీరా తన ఎల్ డొరాడో వరల్డ్ టూర్ నుండి సుమారు 76.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కేవలం ఇదొక్కటే కాదు.. నటిగాను ఆర్జిస్తోంది. సంపాదించిన ఆదాయాన్ని రకరకాల మార్గాల్లో పెట్టుబడిగా పెడుతూ షకీరా భారీగా ఆస్తులను కూడగట్టింది. ఆ ఆస్తుల విలువ సుమారు 24,856 కోట్లు.