Begin typing your search above and press return to search.

దేవర.. ఆమె ట్రాక్ రికార్డ్ పెద్దదే..

ఆమె వివరాల్లోకి వెళితే.. ఈ సాంగ్ ని శిల్పారావు తెలుగులో ఆలపించారు. గతంలో గుంటూరు కారం సినిమాలో ఓబేబీ సాంగ్ ని పాడారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 9:18 AM GMT
దేవర.. ఆమె ట్రాక్ రికార్డ్ పెద్దదే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర నుంచి సెకండ్ సింగిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రొమాంటిక్ యాంగిల్ లో సాగే ఈ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో వ్యూవ్స్ పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూవ్స్ తెచ్చుకున్న పాటలలో ఇది టాప్ 3లో ఉంది. చుట్టమల్లే అంటూ సాగే ఈ సాంగ్ ని మెలోడీ బీట్ తో అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేశారు.

దీంతో ప్రతి ఒక్కరికి సాంగ్ కనెక్ట్ అయ్యింది. సాంగ్ కాపీ ట్యూన్ అంటూ కొన్ని విమర్శలు వస్తున్న కూడా ఆదరణ మాత్రం అద్భుతంగా వస్తోందని చెప్పాలి. ఇక పాటను ఆలపించిన సింగర్ ఎవరు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారి. ఆమె వివరాల్లోకి వెళితే.. ఈ సాంగ్ ని శిల్పారావు తెలుగులో ఆలపించారు. గతంలో గుంటూరు కారం సినిమాలో ఓబేబీ సాంగ్ ని పాడారు.

దేవర మూవీ ఆమెకి తెలుగులో మూడో సినిమాగా ఉంది. శిల్పారావు తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళీ భాషలలో కూడా ఈ పాటని ఆలపించడం విశేషం. ప్రతిచోటా ఒకే తరహా ఆదరణ సాంగ్ కి వస్తోంది. దీంతో శిల్పారావు ఎవరా అంటూ సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే శిల్పారావు 2007 నుంచి సింగర్ గా తన కెరియర్ ని కొనసాగిస్తోంది.

చాలా హిందీ సినిమాలకి సాంగ్స్ పాడింది. గత ఏడాది జైలర్ సినిమాలోని కావాల సాంగ్ ని శిల్పారావు పాడింది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. జంషెడ్ పూర్ లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి శిల్పారావు. అయితే ఎక్కువగా ఆమె బాలీవుడ్ సినిమాలకి పాటలు పాడుతూ వస్తోంది. గుంటూరు కారం సినిమాకి ముందు శిల్పారావు సిద్ధార్ధ్, తమన్నా జంటగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో రెండు సాంగ్స్ పాడింది.

ఆ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. అయితే తెలుగులో ఇప్పుడు దేవరలోని చుట్టమల్లే సాంగ్ తో ఒక్కసారిగా శిల్పారావు పాపులర్ అయ్యింది. హిందీ సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కి కూడా శిల్పారావు సాంగ్స్ పాడింది. అనిరుద్ తో కలిసి జైలర్, జవాన్ సినిమాలకి ఆమె వర్క్ చేసింది. దీంతో దేవరలో కూడా శిల్పారావుతో అనిరుద్ ఈ రొమాంటిక్ సాంగ్ పాడించారు. ఇప్పుడు ఈ సాంగ్ అన్ని భాషలలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక్కసారిగా ఆమె పేరు కూడా తెలుగు రాష్ట్రాలలో మార్మోగిపోతోంది.