సుచీ ఈజ్ బ్యాక్.. స్టార్ హీరో విడాకులపై వ్యాఖ్యలు!
అనంతరం తమిళ స్టార్ హీరో సహా అతడి చుట్టూ ఉండే పలువురు ప్రముఖుల గుట్టంతా సుచీ లీక్స్ లో బయటపడింది.
By: Tupaki Desk | 14 May 2024 9:45 AM GMTతమిళ చిత్రసీమలో సుచీలీక్స్ పర్యవసానం తెలిసిందే. మీటూ ఉద్యమ కాలంలోనే ఇది కూడా ఒక ప్రకంపనం అయింది. తమిళ సినీరంగంలో చాలా మంది స్టార్లు, గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పేర్లు ప్రముఖంగా ఈ జంతర్ మంతర్ స్కామ్ లో బయటపడ్డాయి. కథానాయికలు గాయనీమణులతో హీరోల రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా లీకయ్యాయి.
అయితే గాయని సుచిత్ర తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని అప్పట్లో వాదించారు. తనపై ప్రముఖ స్టార్ అనుచరులు అసభ్యంగా ప్రవర్తించారని కూడా ఆరోపించారు. అనంతరం తమిళ స్టార్ హీరో సహా అతడి చుట్టూ ఉండే పలువురు ప్రముఖుల గుట్టంతా సుచీ లీక్స్ లో బయటపడింది.
అదంతా అటుంచితే ఇటీవలే విడాకులు తీసుకున్న ప్రముఖ తమిళ హీరో, అతడి భార్య గురించి ఇప్పుడు ఆమె తీవ్రమైన కామెంట్లు చేసారు. ఆ ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారని, ఇద్దరి మధ్యా గొడవలున్నాయని వెల్లడించారు. ఇటీవల తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలోనే సదరు స్టార్ హీరో స్వలింగ సంపర్కుడని, డ్రగ్స్ వాడేవాడని కూడా సదరు గాయని ఆరోపించింది.
అయితే దీనిని సదరు స్టార్ హీరో అభిమానులు ఖండిస్తున్నారు. నిజానికి సుచీలీక్స్ సమయంలోనే గాయని సుచిత్ర మానసిక సమస్యలతో బాధ పడుతోందని వీరంతా తోసిపుచ్చారు. చివరికి సుచిత్ర భర్త కూడా తన భార్య మానసిక రోగి అని నివేదించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత తిరిగి సుచీలీక్స్ సుచిత్ర యూట్యూబ్ చానెల్ లో నాటి గొడవల్లో భాగమైన స్టార్ హీరో విడాకుల గురించి ప్రస్థావించడం చర్చనీయాంశమైంది.