Begin typing your search above and press return to search.

ఇదేం బ్యాటింగ్ బాసూ..ఇలా త‌గులుకున్నారు!

రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన `సింగం ఎగైన్` ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 5:33 AM GMT
ఇదేం బ్యాటింగ్ బాసూ..ఇలా త‌గులుకున్నారు!
X

`ఆదిపురుష్` రిలీజ్ అనంత‌రం సోష‌ల్మీడియాలో ఏ రేంజ్లో ట్రోలింగ్ కి గురైందో తెలిసిందే. అందులో పాత్ర‌లు.. మేకింగ్ తీరును ఉద్దేశించి ఎవ‌రి స్టైల్లో వారు ట్రోల్ చేసారు. ట్రోలింగ్ గుర‌వ్వ‌డంలో ఆదిపురుష్ ఓ కొత్త చరిత్ర‌నే రాసింది. పురాణ ఇతిహాసాల నేప‌థ్యంలో ఎన్నోసినిమాలొచ్చాయి. సీరియ‌ల్స్ వ‌చ్చాయి. కానీ ఏది కూడా అంత‌గా ట్రోలింగ్ కి గుర‌వ్వ‌లేదు. సాధార‌ణంగా అలాంటి క‌థ‌లు ఫెయిలైనా ట్రోలింగ్ చేయాల‌న్నా? వెనకా? ముందు ఆలోచిస్తారు.

కానీ అలా ఆలోచించ‌కుండా ట్రోలింగ్ గురైన సినిమా ఇది. ఇదంతా గ‌తం. మ‌రి జ‌రిగిపోయిన గ‌తం గురించి ఇప్పుడు దేనికంటారా? అంటే అందుకు కార‌ణంగా రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన `సింగం ఎగైన్`. ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇది రామాయ‌ణం ఆధారంగా తీసుకున్న క‌థ‌లా క‌నిపిస్తుంది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు రామాయణంతో సంబంధం క‌నిపిస్తుంది. రాముడికి ప్రాతినిధ్యం వహించే బాజీరావ్ సింగం పాత్రలో అజయ్ దేవగన్ నటించగా, కరీనా కపూర్ సీతకు ప్రతీకగా క‌నిపిస్తుంది.

టైగర్ ష్రాఫ్ లక్ష్మణ్ పాత్రలోనూ పోల్చుతున్నారు. రణవీర్ సింగ్ పాత్ర, సింబా, హనుమాన్‌తో పోల్చబడింది. అక్షయ్ కుమార్ జటాయువు గా హైలైట్ అవుతున్నాడు. అర్జున్ కపూర్ రావణుడిలా లంకాధిప‌తిగా క‌నిపిస్తున్నాడు. ట్రైల‌ర్ , విజువల్స్, డైలాగ్ ప్ర‌తీది రామాయణానికి సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే? అజయ్ దేవగన్- అర్జున్ కపూర్ పాత్ర‌ల మ‌ధ్య నాట‌కీయ‌త హైలైట్ గా ఉంది. దీంతో `ఆదిపురుష్` తో ఓంరౌత్ సాధించ‌లేనిది సింగం ఎగైన్తో రోహిత్ శెట్టి సాధిస్తున్నాడంటూ ట్రోల‌ర్లు మ‌ళ్లీ ఎటాకింగ్ కి దిగారు.

`రోహిత్ శెట్టి తన చిత్రం ద్వారా ఓం రౌత్ కంటే మెరుగైన రామాయణాన్ని ఈ ట్రైలర్‌లో చూపించాడు` ఓ యూజ‌ర్ అభిప్రాయ‌ప‌డ‌గా, `రోహిత్ శెట్టి యొక్క కాప్ విశ్వం చిత్రం ఆదిపురుష్ కంటే మెరుగైన ఆదిపురుష్` అంటూ మ‌రోకరు పోస్ట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్టులు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఓంరౌత్ ఆదిపురుష్ కోసం అన్నేళ్లు క‌ష్ట‌ప‌డితే ఇంత ఈజీగా తీసేస్తారా? అంటూ మ‌రికొంత మంది త‌గులుకున్నారు.