Begin typing your search above and press return to search.

నేను అఖండ అయితే అతడు రోలెక్స్

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ తో సమానంగా ఆయన టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకన్నారు

By:  Tupaki Desk   |   5 Nov 2024 6:38 AM GMT
నేను అఖండ అయితే అతడు రోలెక్స్
X

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ తో సమానంగా ఆయన టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకన్నారు. సూర్య నటించిన సినిమాలన్నీ తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ భారీ వసూళ్లను సాధిస్తుంటాయి. ఇప్పుడు సూర్య.. కంగువా మూవీతో తెలుగు, తమిళం సహా అనేక భాషల్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే తాజాగా తెలుగు సూపర్ హిట్ సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ కు గెస్ట్ గా వచ్చారు సూర్య. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆ షో.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం నాలుగో సీజన్ అలరిస్తోంది. ఫుల్ జోష్ తో సందడి చేస్తోంది. ఇప్పుడు సూర్య హాజరైన మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు.

అందులో తన సతీమణి జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి ఆసక్తికర విషయాలను సూర్య పంచుకున్నారు. హోస్ట్ గా బాలయ్య చేసిన సందడిని ఆస్వాదించారు. ఆయనతో సరదా సరదాగా గడిపారు. నటసింహం అడిగిన అన్ని ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తూ నవ్వులు పూయించారు. మధ్యలో ఓ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. చివర్లో కంగువా టీమ్ కూడా ఎపిసోడ్ లో భాగమవ్వగా.. వాళ్లు కూడా బాలయ్యతో ఖుషీగా స్పెండ్ చేశారు.

"నేను సింహం అయితే అతడు సింగం.. నేను అఖండ అయితే అతడు రోలెక్స్.. వన్ అండ్ ఓన్లీ సూర్య" అంటూ బాలయ్య పవర్ ఫుల్ గా ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత కుర్చీలో కూర్చున్న నిమిషం నుంచే ఫన్ మొదలైంది. నేషనల్ అవార్డు అందుకున్న మూమెంట్ ను ఆకాశమే నా హద్దురా అంటూ షేర్ చేసుకున్నారు సూర్య. కార్తి తన ఫోన్‌ లో సూర్య నంబర్‌ ను ఏమని సేవ్‌ చేసుకుంటారని బాలయ్య అడగ్గా.. అది అవుట్‌ ఆఫ్ సిలబస్‌ అంటూ నవ్వులు పూయించారు.

మొదటి క్రష్ ఎవరని బాలయ్య అడగ్గా.. వద్దు సర్‌ ఇంటికి వెళ్లాలని, గొడవలు అవుతాయని అన్నారు. సూర్యకు ఓ హీరోయిన్ అంటే ఇష్టమని సరదాగా చెప్పారు కార్తి. దీంతో నువ్వు కార్తివి కాదు కత్తి రా అని సూర్య సరదాగా అన్నారు. తన లైఫ్ ను జ్యోతిక లేకుండా ఊహించుకోలేనని సూర్య తెలిపారు. తెలుగు ప్రజలు సహాయం చేయడంలో ముందుంటారని కొనియాడారు. మానవత్వం ఉన్న మనిషిగా నలుగురికి సేవ చేయడంలోనే అసలైన ఆనందం ఉందని తెలిపారు. మొత్తానికి ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.