చెప్పా పెట్టకుండా పెళ్లాడుతోందని కూతురిపై హీరో గుస్సా!
ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి
By: Tupaki Desk | 18 Jun 2024 4:33 AM GMTబాలీవుడ్ షాట్ గన్ శత్రుఘ్నసిన్హా నటవారసురాలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా 'లింగా' చిత్రంతో ఇటు సౌత్ కు సుపరిచితురాలు. ఇటీవలే భన్సాలీ హీరామండి చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకుంది. అయితే సోనాక్షి సిన్హా చాలా కాలంగా సల్మాన్ ఖాన్ స్నేహితుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉందన్న ప్రచారం ఉంది. ఈ జంట కలిసి నటించారు. అదే సమయంలో సీక్రెట్ డేటింగ్ మొదలైంది.
ఇప్పుడు జహీర్ ని పెళ్లాడేందుకు సోనాక్షి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. తన పరిశ్రమ స్నేహితురాళ్లతో సోనాక్షి బ్యాచిలరొట్టే పార్టీ నుంచి కొన్ని ఫోటోలు నెట్ లో విడుదలయ్యాయి. జూన్ 23న సోనాక్షి-జహీర్ ఇక్భాల్ జంట పెళ్లి జరగనుంది.
అయితే ఈ పెళ్లి సోనాక్షి తండ్రి, వెటరన్ హీరో కం రాజకీయ నాయకుడు శతృఘ్ణ సిన్హాకు ఎంతమాత్రం ఇష్టం లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇటీవలే జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి సిన్హా వివాహ ప్రణాళికల గురించి తనకు ఏమీ తెలియదని శతృఘ్న సిన్హా మీడియాతో అన్నారు. కుమార్తె సోనాక్షి తన వివాహ ప్రణాళికల గురించి తనకు తెలియజేయనందుకు సిన్హాజీ కలత చెందాడు.
అయితే శత్రుఘ్న సిన్హా స్పందన గురించి సోనాక్షి మామయ్య పహ్లాజ్‌ని మీడియా ప్రశ్నించగా.. తన `లాడ్లీ`(కూతురు)తో కలత చెందాడని.. కానీ అతడి కోపం ఎక్కువ కాలం నిలవదని తెలిపాడు. సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్ వివాహానికి శత్రుఘ్న సిన్హా హాజరవుతారని కూడా పహ్లాజ్ వెల్లడించారు. ఈ వివాహం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జూన్ 23న సన్నిహిత వేడుకగా జరగనుంది. సోనాక్షి తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతడెందుకు బాధపడాలి? నలభై ఏళ్ల క్రితం తనకు నచ్చిన అమ్మాయిని శత్రుఘ్నా జీ పెళ్లి చేసుకున్నాడు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నా జీవిత భాగస్వామిని నేనే ఎంచుకున్నాను. పిల్లలపై అవాస్తవమైన అంచనాలు ఉండకూడదు... అని అన్నారు.
ఎన్నికల కారణంగా దాదాపు మూడు నెలల పాటు ముంబైకి దూరంగా ఉన్నప్పుడు సోనాక్షి అతనితో మాట్లాడి ఉండాలి. భాబీజీకి తెలిసి ఉండాల్సింది. అతడు తిరిగి వచ్చిన తర్వాత దాని (వివాహం) గురించి అతడికి చెప్పాలని సోనాక్షి నిర్ణయించుకుంది. ఇప్పుడు అతడు ముంబైకి తిరిగి వచ్చాడు. సోనాక్షి ఆమె కుటుంబ సభ్యుల మధ్య అంతా బాగానే ఉంది.. అని మామ ప్రహ్లాజ్ వివరణ ఇచ్చారు.
కూతురు పెళ్లిపై శతృఘ్న సిన్హా ఏమన్నారంటే?
శత్రుఘ్న సిన్హా గతంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ``నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. ఎన్నికల ఫలితాల తర్వాత ముంబైకు వెళతాను. నా కుమార్తె ప్రణాళికల గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే మీ ప్రశ్న .. తను పెళ్లి చేసుకుంటుందా? అని.. దాని గురించి ఆమె నాకు ఏమీ చెప్పలేదని నా సమాధానం. తను నన్ను నమ్మితే.. నేను నా భార్య ఆ జంటకు ఆశీస్సులు అందిస్తాము. మేము ఎల్లప్పుడూ తన సంతోషాన్ని కోరుకుంటున్నాము`` అని అన్నారు. మా కుమార్తె తీర్పును మేము పూర్తిగా విశ్వసిస్తాము. ఆమె ఎప్పుడూ రాజ్యాంగ విరుద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకోదు. స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉంది. నా కుమార్తె పెళ్లి అయినప్పుడు నేను బారాత్ ముందు డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను`` అని అన్నారు. నాకు ఆమె (సోనాక్షి) పెళ్లి గురించి ఎందుకు తెలియదని నా సన్నిహితులు నన్ను అడుగుతున్నారు. మీడియాకు ఈ విషయం తెలుసు. ఆజ్ కల్ కే బచ్చే సమ్మతి నహీం లేతే మా-బాప్ కే, సిర్ఫ్ ఇన్‌ఫార్మ్ కర్తే హైన్ అని చెప్పగలం! అని ముగించాడు.
సోనాక్షి - జహీర్ దక్షిణ ముంబై వేదికగా వివాహం చేసుకోనున్నట్లు కథనాలొస్తున్నాయి. అయితే, ఈ జంట తమ వివాహానికి సంబంధించిన వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. మీడియా కథనాల ప్రకారం.. వివాహ ఆహ్వాన పత్రికను `ఈ పుకార్లు నిజమే` అనే టెక్స్ట్‌తో మ్యాగజైన్ కవర్‌లా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.