Begin typing your search above and press return to search.

మహేష్ హీరోయిన్ తో సితార.. వ్వాటే చేంజ్

ఒకప్పుడు మీడియాకి దూరంగా ఉన్న నమ్రత శిరోద్కర్ కూతురు సితార కెరియర్ ని డిజైన్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   17 July 2024 7:36 AM GMT
మహేష్ హీరోయిన్ తో సితార.. వ్వాటే చేంజ్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చింది. తల్లిదండ్రుల బాటలోనే ఆమె కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే యుట్యూబ్, సోషల్ మీడియా ద్వారా సితార బాగా ఫాలోయింగ్ పెంచుకుంది. రెగ్యులర్ గా పేరెంట్స్ తో కలిసి ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు మీడియాకి దూరంగా ఉన్న నమ్రత శిరోద్కర్ కూతురు సితార కెరియర్ ని డిజైన్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో కూతురు కావడంతో ఆటోమేటిక్ గా మీడియా ఫోకస్ అంతా సితార మీద ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారని చెప్పొచ్చు. దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఇందులో సితార పాప కూడా ట్రెడిషనల్ గా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఈ పెళ్లి వేడుకలో సితార బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సిద్దార్ధ్ మల్హోత్రాతో కలిసి ఫోటో దిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరేళ్ళ క్రితం భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీ నటించింది. ఆ మూవీ షూటింగ్ టైంలో 6 ఏళ్ళు ఉన్న సితార కియారా అద్వానీతో కలిసి ఫోటో దిగింది. మరల ఆరేళ్ళ తర్వాత అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ఫోటో దిగింది. ఈ పిక్ లో కియారా అద్వానీ కంటే సితార పొడవుగా కనిపించడం విశేషం. అలాగే లుక్ పరంగా కూడా చాలా వేరియేషన్ కనిపిస్తోంది.

12 ఏళ్ళ వయస్సు ఉన్న సితార పాప ఇట్టే ఎట్రాక్ట్ చేస్తోందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న సితారా సినీ ప్రపంచంలో తనని తాను షోకేస్ చేసుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో నటి గా మారే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో హీరోల నుంచి వారసత్వం తీసుకొని హీరోయిన్స్ వచ్చిన దాఖలాలు తక్కువ..

నిహారిక కొణెదల ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయం అయిన ఆశించిన సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం సితార ఫోటోలని చూస్తుంటే చిన్న వయస్సులోనే ఆమె చాలా ఎదిగిపోయిందని సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ అంటున్నారు. యువరాణిలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నటిగా అడుగులు వేస్తే మాత్రం సితార కు మంచి క్రేజ్ అందుతుందని చెప్పవచ్చు.