మహేష్ కి కూతురంటే ఎంత ప్రేమంటే?
సితారతో ప్రతీ మూవ్ మెంట్ ని ఇన్ స్టా వేదికగా పంచుకునే వారు.
By: Tupaki Desk | 16 Jun 2024 9:58 AM GMTసూపర్ స్టార్ మహేష్ కి కుమార్తె సితార అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. మహేష్ సితారని తన మామ్ గా అభివర్ణిస్తారు. అచ్చం అమ్మ పోలికలు..అమ్మ చేష్టలతో మా అమ్మనే తలపిస్తుందంటారు. అలా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సితార చిన్న పిల్లగా ఉన్న సమయంలో ఇంట్లో మహేష్ ఎంత ఎంజాయ్ చేసేవారో తెలిసిందే. సితారతో ప్రతీ మూవ్ మెంట్ ని ఇన్ స్టా వేదికగా పంచుకునే వారు.
సినిమా షూటింగ్ నుంచి ఇంటొకొచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యేది సితారతోనేనని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అటుపై సితార పెరిగి పెద్దైన తర్వాత తనతో పాటు టీవీ షోలకు తీసుకొచ్చారు. అలా సితారకి సినిమాలంటే ఆసక్తి కూడా పెరిగింది. ఇప్పుడు మంచి డాన్సర్ గానూ ఎదిగింది. ఓ జ్యూయలరీ యాడ్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే. సితారని ఆ యాడ్ లో చూసి మహేష్ ఎంతో మురిసిపోయారు.
తాజాగా ఫాదర్స్ డేని పురస్కరించుకుని సితార ఇన్ స్టాలో ఓ పోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఇద్దరి బాండింగ్ చూస్తే అభిమానుల కడుపు నిండిపోవడం ఖాయం. మరోసారి సితార నాన్న కూచీ అని నిరూపించింది. నాన్న గుండెలపైకి ఎక్కేసి చిన్న పాపాయిలా ఫోజులిచ్చింది. మహేష్ సైతం అంతే ముద్దు చేసారు. తండ్రీ-కుతుళ్లిద్దరు ఇలా మంచం మీద పడుకుని కెమెరాకి ఫోజులిచ్చారు.
మహేష్ -సితార నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇక మహేష్ ఫ్యామిలీ నిన్నటి రోజునే న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. గౌతమ్ చదువుల నిమిత్తం వెళ్లాల్సి రావడంతో ఫ్యామిలీ అంతా అమెరికా ప్లైట్ ఎక్కేసారు. సీతా పాప నాన్నతో ఫాదర్స్ డేని అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.