Begin typing your search above and press return to search.

సితార భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్

చుట్టూ ఎంద‌రు ఉన్నా ఫ్రేమ్‌లో సితార క‌నిపిస్తే చాలు అది ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 12:30 AM GMT
సితార భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్
X

చుట్టూ ఎంద‌రు ఉన్నా ఫ్రేమ్‌లో సితార క‌నిపిస్తే చాలు అది ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు వార‌సురాలు ప్రిన్సెస్ సితార వైబ్స్ గురించి అభిమానుల్లో ముచ్చ‌ట ఇది. ప్ర‌తిసారీ న‌మ్ర‌తా శిరోద్క‌ర్ షేర్ చేసే అంద‌మైన గ్రూప్‌ ఫోటోగ్రాఫ్స్ లో సితార హైలైట్.


త‌న‌దైన అందం.. చిరు న‌వ్వు.. మ‌నోహ‌ర‌మైన‌ ముఖాభిన‌యంతో సీతా పాప‌ మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తోంది. త‌న అందం.. న‌వ్వు మాత్ర‌మే కాదు న‌ట‌న‌, నాట్యం, మాస్ డ్యాన్సెస్ ఇలా అన్ని విధాలుగా ఆక‌ట్టుకుంటోంది. క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించినా సితారే హైలైట్ గా క‌నిపిస్తోంది. బ‌హుశా భార‌త‌దేశంలో ఏ ఇత‌ర స్టార్ హీరో కుమార్తెకు కూడా ఇంత‌టి ఛ‌రిష్మా లేదేమో! అనేంత‌గా క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో సితార క‌ట్టి ప‌డేస్తోంది. ఇంత‌కుముందు సితార హాఫ్ శారీ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో సునామీలా మారాయి. చాలా న‌గ‌రాల్లో సితార ప్ర‌ముఖ క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ల‌కు ప్ర‌మోట‌ర్ గా హాఫ్ శారీలో క‌నిపించిన‌ క‌టౌట్లు ఆక‌ర్షిస్తున్నాయి.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు- న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట గ‌ర్వించే అంద‌మైన కూతురు సితార భ‌విష్య‌త్ సూప‌ర్ స్టార్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సీతా పాపా అంటూ ఇంట్లో అంద‌రూ అల్లారు ముద్దుగా గారాబంగా పిలుస్తుంటారు. కానీ ఇక‌పై ప్రిన్సెస్ సితార‌ అని పిల‌వాల్సిన టైమ్ వ‌చ్చింద‌ని అభిమానులు భావిస్తున్నారు. టాలీవుడ్ కి ఒక రాకుమారి కావాలి.. అది సితార మాత్ర‌మే! అంటూ ఫ్యాన్స్ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక అగ్ర హీరో కుటుంబం నుంచి టాలీవుడ్ లో ఎవ‌రూ సూప‌ర్ స్టార్ లేరు. ఈ లోటు సితార‌తోనే భ‌ర్తీ అవుతుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే సితార న‌టిగా ఎప్పుడు తెరంగేట్రం చేస్తుంది? మ‌హేష్-న‌మ్ర‌త ప్రణాళిక‌లు ఎలా ఉన్నాయి? అనే విష‌యాలు ఇప్ప‌టికి ఇంకా ర‌హ‌స్యం. వాటి గురించి ఓపెన‌వుతారేమో చూడాలి.