Begin typing your search above and press return to search.

సితార ఆరు నుంచి ఏడ‌వ త‌ర‌గ‌తికి!

మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్కూల్ కంటే వెళ్తోంది గానీ మ‌న‌సంతా సినిమా ల‌పైనే ఉంది.

By:  Tupaki Desk   |   26 May 2024 12:13 PM GMT
సితార ఆరు నుంచి ఏడ‌వ త‌ర‌గ‌తికి!
X

మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టి సితార గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్కూల్ కంటే వెళ్తోంది గానీ మ‌న‌సంతా సినిమా ల‌పైనే ఉంది. ఇప్ప‌టికే సినిమాలంటే త‌నకెంత ఫ్యాష‌న్ ఎన్నో సంద‌ర్భాల్లో ప్రూవ్ చేసింది. డాడీ పాట‌ల‌కు రీల్స్ చేయ‌డం... డాన్సు చేయ‌డం వంటి వాటితో సితార లో ఫ్యాష‌న్ బ‌య‌ట‌ప‌డింది. తాజాగా సితార ముందుకు ఓ రేర్ క్వ‌శ్చ‌న్ ముందుకెళ్లింది. మ‌మ్మీ-డాడీల నుంచి ఎలాంటి క్వాలిటీలు నేర్చుకున్నారంటే? మ‌మ్మిలో ఫ్యాష‌న్ సెన్స్.. డాడీలో యాక్టింగ్ స్కిల్స్ అంటూ ఠ‌కీమ‌ని స‌మాధానం ఇచ్చింది.

ఫ్యాష‌న్ విష‌యంలో త‌న మొద‌టి ఛాయిస్ కేవ‌లం మమ్మి మాత్ర‌మేన‌ని ఇంకెవ‌రూ లేర‌ని అంది. డాడ్ లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతను గ్రేట్ న‌టుడిగా భావిస్తాను` అని తెలిపింది. అలాగే ఓ బుచ్చిపాపాయి ఇప్పుడే క్లాస్ చ‌దువుతున్నావ్ అని సితార‌ని అడిగితే ఆరు నుంచి ఏడ‌వ త‌ర‌గ‌తి వ‌స్తాను అని తెలిపింది. నువ్వేం చ‌దువు తున్నావంటే? యూకేజీ అని ఆ పాప చెప్ప‌గా సితార క్యూట్ గా న‌వ్వేసి...సొ క్యూట్ అనేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

సితార ఇప్ప‌టికే ఓ జ్యూవెల‌రీ యాడ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలా తొలిసారి సితార కెమెరా కోసం మ్యాక‌ప్ వేసుకుంది. అయితే త‌ర్వాత కొన‌సాగించ‌లేదు. అందులో న‌టించ‌డం అన్న‌ది అప్ప‌టిక‌ప్పుడు కంపెనీ ప్ర‌పోజ‌ల్ తీసుకురావ‌డంతో న‌టించింది. వెనుక న‌మ్ర‌త కూడా ఉండ‌టంతో డేర్ గా న‌టించింది. ఆ యాడ్ తోనే సితార భ‌విష్య‌త్ లో మంచి స్టార్ అవుతుంద‌ని అంతా గెస్ చేస్తున్నారు. మ‌రి మ‌హేష్ వార‌స‌త్వాన్ని సితార ఇండ‌స్ట్రీలో కొన‌సాగిస్తుందా? అన్న‌ది చూడాలి.

అలాగే సితార చిన్న వ‌య‌సులోనే చారిటీ కార్య‌క్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. అవ్వ తాత‌ల‌పై సితార చూపించే స్వ‌చ్ఛ‌మైన ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా సితార భాగ‌స్వామ్యాన్ని చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంది. ఇందులో తండ్రి వార‌స‌త్వాన్ని సితార చిన్న వ‌య‌సులోనే తీసేసుకుంది.