Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమ‌తో సితార ఘ‌ట్ట‌మ‌నేని

ఈసారి సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన గుంటూరు కారం చిత్రానికి సితార చేసిన ప్ర‌మోష‌న్ ఇప్పుడు టాలీవుడ్ మీడియాలో చ‌ర్చ‌గా మారింది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:19 AM GMT
నాన్నకు ప్రేమ‌తో సితార ఘ‌ట్ట‌మ‌నేని
X

కుమార్తె సితార ఘ‌ట్ట‌మ‌నేనితో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు అనుబంధం ప్ర‌తిసారీ అభిమానుల్లో చ‌ర్చ‌గా మారుతుంటుంది. అలాగే పాపా అంటే సితారకు అమిత‌మైన ప్రేమ‌. త‌న తండ్రి గారిపై ఎంత‌టి ప్రేమ‌? అంటే ప్ర‌తిసారీ న‌మ్ర‌త శిరోద్క‌ర్ షేర్ చేస్తున్న వీడియోలు దానిని చెబుతూనే ఉన్నాయి. గారాల ప‌ట్టీ సితార - మ‌హేష్ స్నేహితుల్లా క‌లిసిపోయి ప్ర‌తిదీ ఆస్వాధిస్తుంటారు. వారి మ‌ధ్య అనుబంధం అభిమానుల‌ను ఎంతో ఎగ్జయిట్ చేస్తుంటుంది.

ఇక మ‌హేష్ న‌టించిన ప్ర‌తి సినిమాని సితార ఘ‌ట్ట‌మ‌నేని త‌న సోష‌ల్ మీడియాల్లో ప్ర‌మోట్ చేస్తుంటారు. ఈసారి సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన గుంటూరు కారం చిత్రానికి సితార చేసిన ప్ర‌మోష‌న్ ఇప్పుడు టాలీవుడ్ మీడియాలో చ‌ర్చ‌గా మారింది. గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్ ని సితార ఎంతో వైవిధ్యంగా చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇంత‌కుముందు సూపర్ స్టార్ మహేష్‌తో కలిసి హైదరాబాద్ థియేటర్‌లో 'గుంటూరు కారం' షో చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి సితార తొలి పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం సితార అనాథ పిల్లల కోసం ఏఎంబీ సినిమాస్‌లో గుంటూరు కారం ప్రత్యేక షో నిర్వహించారు. అక్కడితో ఆగకుండా ఆమె తన స్నేహితుల‌ పార్టీ కోసం మహేష్‌కి చెందిన గుంటూరు కారం షర్ట్‌లో వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె దమ్ మసాలా సాంగ్ రీల్ తోను ఆక‌ట్టుకుంది. ఇలా మూడు వారాల త‌ర్వాత కూడా గుంటూరు కారం గురించి స‌ర్వ‌త్రా ముచ్చ‌టించుకునేలా చేసింది సితార. నాన్న‌కు ప్రేమ‌తో సితార అందించిన స్పెష‌ల్ గిఫ్ట్ ఇది అని భావించాలి. ఇక సితార‌కు సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. మిలియ‌న్ ల క్లిక్ లు లైక్ ల‌తో హోరెత్తుతోంది. ఇది మ‌హేష్‌ సినిమాల ప్ర‌మోష‌న్స్ కి బిగ్ బూస్ట‌ర్ అన‌డంలో సందేహం లేదు.

రాజ‌మౌళి కోసం మ‌హేష్ ప్రిప‌రేష‌న్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం ప్రిప‌రేష‌న్ మోడ్ లో ఉన్నాడు. ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇద‌ని చెబుతున్నారు. దీని కోసం ఫిట్నెస్ ట్రైన‌ర్ తో పాటు మ‌హేష్ కార‌డ‌వుల్లో తిరిగి వ‌చ్చారు. జ‌ర్మ‌నీలోని డీప్ ఫారెస్ట్ లో ఈ సినిమా కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించాల్సి ఉండ‌గా, మ‌హేష్ అక్క‌డి అరుదైన వాతావ‌రణాన్ని అల‌వాటు ప‌డ‌టానికి సంసిద్ధంగా ప్రిప‌రేష‌న్ సాగించార‌ని స‌మాచారం. మహేష్ బాబు తన రెండు వారాల‌ జర్మనీ టూర్ ముగించి హైద‌రాబాద్ కి తిరిగి వ‌చ్చారు. త‌దుప‌రి గుంటూరు కారం స‌క్సెస్ మీట్ లో అత‌డు క‌నిపించే వీలుంది.