Begin typing your search above and press return to search.

'సీతారామం కి అరుదైన అవార్డ్‌

సీతారామం సినిమా తో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా టాప్ స్టార్‌ హీరోయిన్ గా పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది

By:  Tupaki Desk   |   15 Aug 2023 5:55 AM GMT
సీతారామం కి అరుదైన అవార్డ్‌
X

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన పీరియాడిక్ లవ్‌ కమ్ రొమాంటిక్ మూవీ సీతారామం భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సీతారామం సినిమా తో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా టాప్ స్టార్‌ హీరోయిన్ గా పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది.

పలు అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్న సీతారామం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌ బోర్న్‌ అవార్డును సీతారామం దక్కించుకుంది. అంతర్జాతీయ వేదికపై సీతారామం సినిమా యూనిట్ సభ్యులు అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. చిత్ర దర్శకుడు నిర్మాత మరియు హీరోయిన్‌ లు ఈ వేదికపై సందడి చేశారు.

ఇండియన్ సినీ ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును సీతారామం దక్కించుకున్న నేపథ్యంలో తెలుగు సినిమా కు గర్వకారణం అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సీతారామం సినిమా గురించి మరోసారి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

మెల్‌ బోర్న్ లో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. కమర్షియల్‌ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సీతారామం సినిమా పలు అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల చిత్ర యూనిట్ సభ్యులతో పాటు తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.