Begin typing your search above and press return to search.

దుల్కర్.. సీతారామం క్రేజ్ ను యూజ్ చేసుకోవట్లే?

తెలుగులో మహానటి సినిమాతో అడుగుపెట్టిన మళయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్ గా అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   5 Aug 2023 10:46 AM GMT
దుల్కర్.. సీతారామం క్రేజ్ ను యూజ్ చేసుకోవట్లే?
X

తెలుగులో మహానటి సినిమాతో అడుగుపెట్టిన మళయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.. పాన్ ఇండియా స్టార్ గా అన్ని భాషలలో సినిమాలు చేస్తున్నారు. హిందీలో కూడా అడుగుపెట్టి రెండు సినిమాలు చేశారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన మూడో తెలుగు సినిమాకి దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికంటే ముందుగా దుల్కర్ చేసిన సీతారామం సినిమా ఎలాంటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో అయితే ఏకంగా 40 కోట్లు ఈ చిత్రం కలెక్ట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. సీతారామం మూవీతో టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ పై 'కింగ్ ఆఫ్ కొత్తా' అనే మూవీ చేశారు.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి హైప్ ఉందని చెప్పొచ్చు. అయితే తాజాగా కింగ్ ఆఫ్ కొత్తా మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ చాలా తక్కువ ధరకి ఇచ్చేశారు.

ఆంధ్రా హక్కులు కేవలం 2.5 కోట్ల రేషియోతో డిస్టిబ్యూటర్ కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక నైజాం, సీడెడ్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయంట. సితారామం సినిమాతో దుల్కర్ కి తెలుగులో స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ వచ్చింది. అయితే కింగ్ ఆఫ్ కోతా టీజర్ తెలుగులో రిలీజ్ చేసి బిజినెస్ చేసుకుంటే కచ్చితంగా ఎక్కువ మొత్తంలో రైట్స్ అమ్ముడయ్యేవనే మాట వినిపిస్తోంది.

ఆగష్టు 24న ఈ చిత్రంలో రిలీజ్ కాబోతోంది. తెలుగులో కింగ్ ఆఫ్ కొత్తా మూవీని కాస్తా గట్టిగా ప్రమోషన్ చేస్తే జనాల్లోకి బాగా వెళ్తుంది. తరువాత పెద్ద ప్రొడక్షన్స్ భారీ ధరకి రైట్స్ కోసం ఆఫర్ చేసే అవకాశం ఉండేది. అయితే ఎందుకనో దుల్కర్ మాత్రం ఈ చిత్రం విషయంలో పూర్తిగా మలయాళం మీదనే ఫోకస్ చేసినట్లు ఉన్నాడు. తెలుగులో సీతారామం సినిమాతో వచ్చిన హైప్ ని అతను కరెక్ట్ గా ఉపయోగించుకోవడం లేదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.