Begin typing your search above and press return to search.

'సీతారామం'తో IFFM వేదికపై టాలీవుడ్ స‌గ‌ర్వంగా..!

ప్రతిష్టాత్మక అవార్డుల కార్య‌క్ర‌మం అద్భుత‌మైన గ్లామర్ క‌ళ‌తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 4:14 AM GMT
సీతారామంతో IFFM వేదికపై టాలీవుడ్ స‌గ‌ర్వంగా..!
X

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) వార్షిక వేడుక సినిమాలు.. OTT సిరీస్‌లలో విస్తరించి ఉన్న భారతీయ చలనచిత్ర సోదరుల అద్భుతమైన ప్రతిభను గౌరవించే విధంగా ఆస్ట్రేలియా నడిబొడ్డున నిర్వహించడం ప్ర‌తియేటా చూస్తున్న‌దే. IFFM అవార్డుల ఈవెంట్ నిన్న‌టి రేయి మరోసారి హైలైట్ గా నిలిచింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ సినీరత్నాలను సత్కరించిన అరుదైన వేదికగా మెల్ బోర్న్ నిలిచింది. ప్రతిష్టాత్మక అవార్డుల కార్య‌క్ర‌మం అద్భుత‌మైన గ్లామర్ క‌ళ‌తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. అత్యుత్తమ భారతీయ సినిమా & OTT సిరీస్‌ల‌కు ఈ వేదిక‌పై పుర‌స్కారాలు అందించారు.

టాలీవుడ్ నుంచి ఈసారి `సీతారామం` చిత్రం పుర‌స్కారాన్ని ద‌క్కించుకుంది. సీతారామం చిత్రంతో దుల్కార్ పాన్ ఇండియా స్టార్ గా త‌న‌దైన ముద్ర వేయ‌గా.. మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌గా టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయింది. తెలుగు ద‌ర్శ‌కుడు హ‌నురాఘ‌వ‌పూడి ప‌నిత‌నానికి గొప్ప గుర్తింపు ద‌క్కింది. బాలీవుడ్ నుంచి ప‌లు సినిమాల‌కు పుర‌స్కారాలు ద‌క్కాయి. ఆలియా డార్లింగ్స్- షారూఖ్‌ పఠాన్ గొప్ప గౌరవాన్ని అందుకున్నాయి. జూబ్లీ -దహద్ వంటి వెబ్ సిరీస్‌లు కూడా అవార్డులను అందుకున్నాయి. శ్రీమతి ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణి ముఖర్జీ .. `ఆగ్రా` చిత్రానికి మోహిత్ అగర్వాల్ ఉత్తమ నటనా పురస్కారాలను అందుకోగా, దుల్కార్ స‌ల్మాన్ న‌టించిన‌ `సీతా రామం` ఉత్తమ చిత్రంగా, కన్నడ చిత్రనిర్మాత పృథ్వీ కోననూర్ ఉత్తమ దర్శకుడిగా హదినెలెంటు (సెవెన్టీనర్స్)కు ఎంపికయ్యారు.

వెబ్ సిరీస్ ల విష‌యానికి వస్తే... జూబ్లీ బెస్ట్ సిరీస్ పుర‌స్కారాన్ని కైవసం చేసుకోగా, బెస్ట్ పెర్ఫార్మర్స్ మేల్ మరియు ఫిమేల్ పుర‌స్కారాలు దహాద్ లో న‌టించిన‌ విజయ్ వర్మ ...ట్రయల్ బై ఫైర్ లో న‌టించిన‌ రాజశ్రీ దేశ్‌పాండే అందుకున్నారు. ఈ వేదిక‌పై ప‌లు చిత్రాలకు నటీనటులకు గౌరవ పురస్కారాలు అందించారు. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొణె నటించిన బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ `పఠాన్` పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకోగా, అలియా భట్ నటించిన డార్లింగ్స్ ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డును అందుకుంది. కరణ్ జోహార్ తన 25 సంవత్సరాల కెరీర్ తో గొప్ప నిర్మాతగా స‌న్మానం అందుకున్నారు. అయితే కార్తీక్ ఆర్యన్ రైజింగ్ గ్లోబల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును అందుకున్నాడు. మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ ఇన్ సినిమా అవార్డును అందుకోగా, భూమి పెడ్నేకర్‌కు డిస్‌రప్టర్ అవార్డును అందజేశారు.

మెల్‌బోర్న్‌లోని ఐకానిక్ హామర్ హాల్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవం కళాకారులు, చిత్రనిర్మాతలు, ఔత్సాహిక సినీప్రియుల కలయికకు సాక్ష్యంగా నిలిచింది. ఇది భార‌తీయ సినిమాకు తెలుగు సినిమాకు కూడా అద్భుత‌మైన మ‌ర‌పురాని రాత్రి. 2023 IFFM అవార్డ్స్ నైట్ గత సంవత్సరంలో గొప్ప ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కించుకున్న‌ ఉపఖండంలోని చలనచిత్రాలు -ఓటీటీ కంటెంట్ ని ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించారు. భారతీయ వినోద ప‌రిశ్ర‌మ‌ డైనమిక్ గా అభివృద్ధి చెందుతున్న దృశ్యాన్ని కూడా ఈ వేదిక ఆవిష్క‌రించింది.