Begin typing your search above and press return to search.

మొన్న జయకృష్ణ.. ఇప్పుడు గౌతమ్.. సితార బిగ్ అప్డేట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Aug 2024 11:18 AM GMT
మొన్న జయకృష్ణ.. ఇప్పుడు గౌతమ్.. సితార బిగ్ అప్డేట్!
X

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమదైన యాక్టింగ్ అండ్ టాలెంట్ తో తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మరికొందరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మహేష్ బాబు.. తెలుగులో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన అన్నయ్య రమేష్ బాబు పలు సినిమాల్లో హీరోగా నటించినా.. ఆ తర్వాత అకస్మాత్తుగా మరణించారు.

రీసెంట్ గా రమేష్ బాబు తనయుడు జయకృష్ణ.. హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అతను స్పెషల్ ఫోటో పోస్ట్ చేయగా.. అదిరే రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ గా మహేష్ పోలికలతో ఆకట్టుకున్నారు. జయకృష్ణ కెరీర్ కు సంబంధించిన విషయాలను మహేష్ బాబు దగ్గరుండి చూసుకుంటారని సమాచారం. అయితే మహేష్ వారసుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారోనని నెటిజన్లు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు.

మహేష్ డాటర్ సితార గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. ఓ జ్యువెలరీ యాడ్ తోపాటు సాంగ్ లో కనిపించి మెప్పించింది. తన దాతృత్వ కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. నెట్టింట పాపులర్ అయిన స్టార్ కిడ్.. ఇండస్ట్రీలోకి కచ్చితంగా రానుంది. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. మరోవైపు, గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఆ మధ్య గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కూడా జరిగింది.

సితార సినీ ఎంట్రీ ఖరారు అయినప్పటికీ.. గౌతమ్ మాత్రం హీరోగా ఇండస్ట్రీలోకి వస్తాడా రాడా అన్న విషయంపై చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు సితార వాటిని కాస్త క్లియర్ చేసింది. గౌతమ్ కూడా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తాడని క్లారిటీ ఇచ్చింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడని చెప్పింది. నాలుగేళ్ల కోర్సు చేస్తాడని తెలిపింది. ఆ తర్వాత ఎంట్రీ ఇస్తాడని వెల్లడించింది. తనకు, గౌతమ్ కు మహేష్ బాబు ఎప్పుడూ మంచి సపోర్ట్ అందిస్తారని పేర్కొంది.

తనతోపాటు గౌతమ్ సినీ కెరీర్ ను ఎంచుకునే విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది. అయితే మహేష్ ప్రస్తుతం జక్కన్న సినిమా చేస్తున్నారు. సితార కామెంట్స్ ప్రకారం, గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మరో నాలుగేళ్ల టైమ్ కచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గౌతమ్ కన్నా ముందు జయకృష్ణ ఎంట్రీ ఇస్తాడేమోనని నెటిజన్లు చెబుతున్నారు. మరి కృష్ణ ఫ్యామిలీ మూడో తరం ఎవరెప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.