Begin typing your search above and press return to search.

సితార డైరెక్ట్ గా హాలీవుడ్ కే గురి!

'చిన్న‌ప్ప‌టి నుంచి నాన్న‌ని చూసి పెర‌గ‌డం వ‌ల్ల సినిమాలంటే ఆస‌క్తి క‌లిగింది. నాకు సినిమాల్లోకి రావాల‌ని ఉంది. అయితే ఇంగ్లీష్ సినిమాల్లోనే న‌టించాల‌నుకుంటున్నా' అని తెలిపింది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 11:59 AM GMT
సితార డైరెక్ట్ గా హాలీవుడ్ కే  గురి!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ వార‌సురాలిగా సితార ఎంట్రీ దాదాపు ఖాయ‌మే. మామ్ రిటైర్మెంట్ తీసుకున్న హీరోయిన్ అయితే డాడ్ స‌క్సెస్ పుల్ గా దూసుకుపోతున్న ఓ పెద్ద స్టార్. అలా చిన్న నాటి నుంచే సినిమా వాతావ‌ర‌ణం అల‌వాటైంది. చిన్న వ‌య‌సులోనే మామ్ ఒడిలో కూర్చుని స్టెప్పులేసేది. ఇక పెద్దాయ్యాక సినిమాలంటే పూర్తిగా ఎంత ఇష్ట‌మో త‌న వీడియోల ద్వారా చెప్పేసింది. న‌టిగా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే ఓ యాడ్ సైతం చేసింది.

ఇలా ఇన్నిసంకేతాలు క‌ళ్ల ముందుండ‌గా సితార న‌టి కాక? మ‌రే రంగంలోకి వెళ్ల‌ద‌ని దాదాపు ఖాయ‌మైంది. దీంతో సితార చ‌దువులు పూర్త‌యిన త‌ర్వాత టాలీవుడ్ లో ఆమె ఎంట్రీ ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. ఒక‌వేళ టాలీవుడ్ కాక‌పోతే బాలీవుడ్ లో నైనా త‌ప్ప‌క లాంచ్ అవుతుంద‌ని అనుకుం టున్నారు. కానీ సితార మ‌న‌సులో ఈ రెండు ప‌రిశ్ర‌మ‌లు కూడా లేవు. ఏకంగా హాలీవుడ్ లోనే ఎంట్రీ ఇస్తాన‌ని చెప్పేసింది. ఆ సంగ‌తేంటో ఆమె మాట‌ల్లోనే..

'చిన్న‌ప్ప‌టి నుంచి నాన్న‌ని చూసి పెర‌గ‌డం వ‌ల్ల సినిమాలంటే ఆస‌క్తి క‌లిగింది. నాకు సినిమాల్లోకి రావాల‌ని ఉంది. అయితే ఇంగ్లీష్ సినిమాల్లోనే న‌టించాల‌నుకుంటున్నా' అని తెలిపింది. ఈవిష‌యాలన్నీ ఇంత‌కాలం త‌న మ‌న‌సులోనే దాచుకుంది. ఫాద‌ర్స్ డేని పుర‌స్క‌రించుకుని సితార ఈ విష‌యాన్ని రివీల్ చేసింది. దీంతో సితార‌ని తెలుగు తెర‌పై చూసే ఛాన్స్ త‌క్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది.

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వం నుంచి మ‌హ‌ష్ న‌టుడ‌య్యాడు. అలాగే మంజుల కూడా కొన్ని సినిమాలు చేసారు. కానీ త‌దుప‌రి ఆమె కొన‌సాగ‌లేదు. తాజాగా సితార మాట‌ల్ని బ‌ట్టి టాలీవుడ్ లో ఆమె సినిమాలు చేసే అవ‌కాశం లేద‌నిపిస్తుంది. మరి చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత సితార మ‌నసు మారితే గ‌నుక ఛాన్సెస్ ఉంటాయి.