Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ సితార.. వచ్చేది ఎప్పుడంటే..

అయితే మిస్టర్ బచ్చన్ మూవీపై ఆడియన్స్ తోపాటు సినీ ప్రియుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 3:34 PM GMT
మిస్టర్ బచ్చన్ సితార.. వచ్చేది ఎప్పుడంటే..
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీపై ఆడియన్స్ తోపాటు సినీ ప్రియుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే రవితేజ చిత్రం అంటేనే మంచి అంచనాలు ఉంటాయి. అందులో కూడా హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చేయడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు రవితేజ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమాలో కూడా బిగ్ బి ఫ్యాన్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.

అయితే ప్రమోషన్స్ లో భాగంగా.. మేకర్స్ నేడు సినిమా నుంచి సితార్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను జూలై 10వ తేదీ ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ప్రోమో సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాంగ్ అంతా ఉండనున్నట్లు ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చేసింది. ట్యూన్ కూడా చాలా బాగుంది. రవితేజ, భాగ్యశ్రీ తన స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

ఇంప్రెసివ్‌ గా సాగుతున్న ప్రోమో.. సాంగ్ పై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ బాణీలు కట్టిన ఆ పాటకు సాహితీ లిరిక్స్ అందించారు. సాకేత్ కోమండూరి, సమీరా భరద్వాజ్ ఆలపించారు. సారాహ్ గిటార్ మ్యూజిక్ తో అలరించారు. వెంకటేష్ పట్వారీ వోకల్స్ అందించారు. పుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

అయితే 2024లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అదే రోజు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, ఆయ్ సినిమాలు విడుదల అవ్వనున్నాయి. మరి మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15నే రిలీజ్ అయితే క్లాషే. మరేం జరుగుతుందో చూడాలి.