Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ సితార్.. తెలుగుతో నిండిన రొమాంటిక్ మెలోడీ

ఇటీవల సితార్ సాంగ్ ప్రోమో విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక నేడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   10 July 2024 7:01 AM GMT
మిస్టర్ బచ్చన్ సితార్.. తెలుగుతో నిండిన రొమాంటిక్ మెలోడీ
X

తెలుగు సినిమాల్లో ఈమధ్య అచ్చమైన తెలుగు పాటలు వచ్చి చాలా కాలమైంది. ఇక అప్పుడప్పుడు కొందరు దర్శకులు మాత్రమే మన కమ్మని తెలుగు పదాలకు సినిమాలో స్పెస్ ఇస్తున్నారు. సినిమా విజయానికి పాటలు, ఫైట్స్, యాక్టింగ్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక తరహా ట్రెండ్ లో ఇప్పుడు హరీష్ శంకర్ కూడా చేరారు. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ఆయన రూపొందిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార్ పాటను అచ్చమైన తెలుగు మెలోడీ గా విడుదల చేశారు.

మిస్టర్ బచ్చన్ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ రైడ్ కి రీమేక్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ అన్ని వర్క్స్ పూర్తి చేసి సినిమా విడుదలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి మ్యూజికల్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు.

ఇటీవల సితార్ సాంగ్ ప్రోమో విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక నేడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత సాహితి అంధించిన లిరిక్స్ కు మిక్కీ జేఏసీ మేయర్ మ్యూజిక్ అలాగే సాకేత్, సమీరా గానం పర్ఫెక్ట్ గా సెట్టయ్యాయి. ఈ పాటను వింటుంటే చాలా రోజుల తరువాత ఒక పూర్తి తెలుగు పాటను విన్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ మధ్యలో ఉన్న కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉందీమ్ రొమాంటిక్ మెలోడీ లో వారు వేసిన స్టెప్పులు మ్యూజిక్ కు తగ్గట్టుగా ఉన్నాయి. హరీష్ శంకర్ తన ప్రత్యేక శైలిలో పాటను ఫైనలైజ్ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక సితార్ సాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోయే మెలోడీగా నిలుస్తుందనే ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.

సితార్ సాంగ్ ప్రోమోలోని ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటోంది. రవితేజ మరియు భాగ్యశ్రీ బొర్సే మధ్య డ్యూయెట్ సాంగ్ గా ఈ పాటను అందమైన లొకేషన్లలో షూట్ చేసినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ లవర్స్ ఈ పాటకు ఎంతగా స్పందిస్తారో తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు సర్వం సిద్ధం అవుతుండగా పర్ఫెక్ట్ టైమ్ లో ప్రమోషన్ తో బజ్ క్రియేట్ చేశారు.