Begin typing your search above and press return to search.

సితార ఘ‌ట్ట‌మ‌నేని పాప్‌స్టార్ వైబ్స్

సితార ఘ‌ట్ట‌మ‌నేని ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- న‌మ్ర‌త దంప‌తుల ఏకైక గారాల‌ప‌ట్టీ. 12 వ‌య‌సుకే చాలా గుర్తింపు తెచ్చుకుంది సితార‌.

By:  Tupaki Desk   |   1 Dec 2024 8:48 AM GMT
సితార ఘ‌ట్ట‌మ‌నేని పాప్‌స్టార్ వైబ్స్
X

సితార ఘ‌ట్ట‌మ‌నేని ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- న‌మ్ర‌త దంప‌తుల ఏకైక గారాల‌ప‌ట్టీ. 12 వ‌య‌సుకే చాలా గుర్తింపు తెచ్చుకుంది సితార‌. ప్రస్తుతం హైదరాబాద్‌లోని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. బాల నటిగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా.. కూచిపూడి .. బ్యాలెట్ డ్యాన్సర్‌గా సితార‌ శిక్షణ పొందింది. నటన- మోడలింగ్‌పైనా ఆసక్తిని క‌న‌బ‌రుస్తోంది. ఇంత‌కుముందు ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించగా కోటి ఆర్జించిన సితార‌, ఆ మొత్తాన్ని చారిటీకి అందించి త‌న గొప్ప మ‌న‌సును చాటుకుంది.

సితార కూడా గ్లామ‌ర్ రంగంలో తన తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. చదవడం, పెయింటింగ్ చేయడం, గిటార్ వాయించడం, ఈత కొట్టడం త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వ్యాప‌కాలు. తన కుటుంబం సినీరంగంలో ఉంది గ‌నుక‌.. వారసత్వాన్ని కొనసాగించాలని ఆలోచిస్తున్నానని, అయితే ఇంకా క‌చ్చితంగా దీని గురించి తెలియదని సితార గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

అయితే సితార త‌న త‌ల్లిగారైన న‌మ్ర‌త‌తో క‌లిసి ప‌బ్లిక్ అప్పియ‌రెన్సులు ఇవ్వ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది. తాజాగా

గ్రామీ విన్నింగ్ సింగర్ ముంబైలో గత రాత్రి (నవంబర్ 30) MMRDA గ్రౌండ్స్‌లో తన తొలి సంగీత కచేరీ ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ కచేరీకి హాజరైన వారిలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఉన్నారు. నమ్రత - సితార ఇద్దరూ దువా లిపాతో క‌లిసి దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసారు. కచేరీని ఆస్వాధించిన తర్వాత వీరంద‌రికీ పాప్ ఐక‌న్ డ్యుయా లిపాను కలిసే అవకాశం లభించింది. ముఖ్యంగా సితార పాప్ స్టార్ డ్యుయాలిపాతో ఫ్యాన్ గ‌ర్ల్ మూమెంట్‌ను ఆస్వాధించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి.

నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో ఈ పోటోల‌ను షేర్ చేసారు. సితార డుయా లిపాతో పోజులిచ్చిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ఆఫ్ షోల్డర్ షిమ్మరీ డ్రెస్ లో సితార ఎంతో అందంగా కనిపించగా, నమ్రత నేవీ బ్లూ జాకెట్‌తో బ్లాక్ కో ఆర్డ్ సెట్‌ను ధరించింది. ఈ ఫోటోల‌ను షేర్ చేసిన‌ నమ్రత @dualipa జస్ట్ స్టన్నింగ్ అని రాశారు. మ‌రోవైపు సితార దువా లిపాతో వరుసగా సెల్ఫీలు దిగింది. పాప్ సింగర్ డ్యువా లిపా సితార స‌హా త‌న‌ స్నేహితులతో ఆనందంగా పోజులిచ్చింది. ఇక అంత‌ర్జాతీయ పాప్ స్టార్ తో సితార‌ను చూడ‌గానే అభిమానులు సీతాపాప పాప్ స్టార్! అంటూ కితాబిచ్చేస్తున్నారు. అలాగే రెడ్ హార్ట్ ఈమోజీల‌తో సీతాపాప‌పై త‌మ ప్రేమ‌ను కురిపించారు. భార‌త‌దేశం నుంచి సితార ఘ‌ట్ట‌మ‌నేని కూడా పెద్ద పాప్ స్టార్ కాగ‌ల‌దు! అని అంద‌రూ ప్రోత్స‌హిస్తున్నారు. సితార ఛ‌రిష్మాటిక్ లుక్స్ ని బ‌ట్టి త‌న‌కు ఆ అర్హ‌త ఉంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

ఈ శ‌నివారం రాత్రి డ్యుయా లిపా ముంబై సంగీత కచేరీ నుండి వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఆమె తన హిట్ పాటల ప్రదర్శనలతో అభిమానులకు స్పెష‌ల్ ట్రీటిచ్చింది. లెవిటేటింగ్ వ‌ర్సెస్ వో లడ్కీ జో (షారూఖ్ ఖాన్ -బాద్షా పాట‌) మాష్-అప్ లోను న‌ర్తించింది. అది అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ వీడియో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ దృష్టిని కూడా ఆకర్షించింది. సితార-న‌మ్ర‌త‌తో పాటు నటుడు రణవీర్ షోరే, అతని కుమారుడు హరూన్, నేహా శర్మ, ఐషా శర్మ త‌దిత‌రులు క‌చేరీలో పాల్గొన్నారు.