Begin typing your search above and press return to search.

సితార.. జెట్ స్పీడ్ ల్ ఆ క్రేజీ సీక్వెల్?

సితార ఎంటర్టైన్మెంట్స్ లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ మ్యాడ్

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:33 AM GMT
సితార.. జెట్ స్పీడ్ ల్ ఆ క్రేజీ సీక్వెల్?
X

సితార ఎంటర్టైన్మెంట్స్ లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ మ్యాడ్. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కంప్లీట్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులని అలరించింది. నార్నె నితిన్ ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. రామ్ నితిన్, సంగీత్ శోభన్ కి మూవీ మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.

ఇలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ కథలని ప్రేక్షకులు కూడా ఇష్టంగా చూస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ అసోసియేట్ ఈ మ్యాడ్ సినిమాని తన గురువు స్టైల్ లో చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఎనౌన్స్ చేశారు. ఆ సినిమాలో నటించిన వారితోనే మ్యాడ్ 2 కూడా ఉంటుందంట.

ఈ సారి కాలేజీ బ్యాక్ డ్రాప్ తీసుకున్న కూడా కొత్త కథని దర్శకుడు కళ్యాణ్ శంకర్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంట. మూడు షెడ్యూల్స్ లో మూవీ మొత్తం కంప్లీట్ చేసి వీలైనంత తక్కువ సమయంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే కళ్యాణ్ శంకర్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. మ్యాడ్ మూవీతో సంగీత్ శోభన్ అయితే స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఓటీటీలో కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ సిస్టర్ ఈ సినిమాని నిర్మించింది.

ఇక మ్యాడ్ 2 మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కథ కావడంతో ఆటోమేటిక్ గా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు. అందుకే ఇది హిట్ ఫార్ములా అని మ్యాడ్ 2 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.