యూట్యూబర్ కేసు పెట్టిన శివ బాలాజీ!
'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బ తీసేలా అతడు తరుచూ వీడియోలు తీస్తున్నాడని తెలిపారు.
By: Tupaki Desk | 8 Sep 2024 10:26 AM GMTకొంత మంది నటీనటుల్ని ఉద్దేశించి నెగిటివ్ ట్రోల్స్ చేస్తోన్న యూ ట్యూబర్ విజయ్ చంద్రహాస్ పై నటుడు, 'మా' కోశాధికారి శివబాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. నటులతో పాటు మరీ ముఖ్యంగా మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థను ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'మా' మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బ తీసేలా అతడు తరుచూ వీడియోలు తీస్తున్నాడని తెలిపారు.
వాటికి సంబంధించిన వీడియో లింక్స్ ను పోలీసులకు అందజేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యూ ట్యూబర్ కి నోటీసులు జారీ చేసారు. సెలబ్రిటీలపై తప్పుడు కథనాలు..ట్రోలింగ్ లు చేస్తే మా అసోసియేషన్ తరుపున కేసులు పెడతామని..చట్టపరంగా శిక్ష పడేలాచేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయిందని..ఇకపై మాత్రం తప్పుడు కథనాలు..ట్రోలింగ్ లు చేస్తే ఊరుకో బమని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించారు. అయినా కొందరు ఆగడాలు కొనసాగడంతో చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇక శివ బాలాజీ గతంలో చాలా సందర్బాల్లోనూ ట్రోలింగ్ గురయ్యా డు. కానీ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి మాత్రం ఆయనా వ్యక్తిగతంగా ట్రోలింగ్ లను తీసుకుని చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శివ బాలాజీ సినిమాలతో పాటు, టీవీ షోల్లోనూ పాల్గొంటున్నాడు. మంచు విష్ణు అధ్యక్షుడైన తర్వాత `మా` లోనూ అతని ప్రాధాన్యత పెరిగింది. గత టెర్మ్ లో కేవలం సభ్యుడిగా మాత్రమే ఉండే వాడు. విష్ణు ప్రెసిడెంట్ అయినత తర్వాత కోశాధికారిగా ప్రమోట్ అయ్యాడు.