Begin typing your search above and press return to search.

శివ కార్తికేయన్ 25.. పెద్ద ఛాలెంజే..!

శివ కార్తికేయన్ 25వ సినిమా మహిళా దర్శకురాలు సుధా కొంగరతో ఫిక్స్ చేసుకున్నాడు. పీరియాడికల్ కథతో రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 11:30 PM GMT
శివ కార్తికేయన్ 25.. పెద్ద ఛాలెంజే..!
X

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ఈమధ్యనే అమరన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మేజర్ ముకుంద్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న శివ కార్తికేయన్ తన కెరీర్ లో 25వ సినిమాను చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. శివ కార్తికేయన్ 25వ సినిమా మహిళా దర్శకురాలు సుధా కొంగరతో ఫిక్స్ చేసుకున్నాడు. పీరియాడికల్ కథతో రాబోతున్న ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

సుధ కొంగర అంతకుముందు సూర్యతో సురారై పొట్రు సినిమా చేసింది. ఆ సినిమా సౌత్ లో సూపర్ హిట్ అవ్వడంతో అదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఐతే అక్కడ మాత్రం సినిమా డిజాస్టర్ అయ్యింది. ఐతే సూర్యతోనే సుధ కొంగర మరో సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. సుధ కొంగర రాసుకున్న ఈ సినిమాకు పూరణ నూరు అని ఫిక్స్ చేశారు. సూర్య తో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా లాంటి స్టార్స్ అందులో నటిస్తారని చెప్పుకొచ్చారు.

కానీ కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ నుంచి సూర్య ఎగ్జిట్ అవ్వగా ఆ నెక్స్ట్ దుల్కర్ కూడా వచ్చేశాడు. ఐతే శివ కార్తికేయన్ తో మొదలు పెట్టే టైం లో కూడా సుధా కొంగరతో కాస్త డిస్టబెన్స్ వచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఐతే అవన్ని ఇప్పుడు సర్ధుకుని సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు. పూరణ నూరు సినిమాలో శివ కార్తికేయన్ తో పాటుగా జయం రవి, అధర్వ కూడా భాగం అవుతున్నారు. సో సూర్య చేయాల్సిన ఈ సినిమా శివ కార్తికేయన్ చేతికి వచ్చింది.

కెరీర్ ని వీజేగా మొదలు పెట్టిన శివ కార్తికేయన్ తన ప్రతి సినిమాతో క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. అమరన్ తో బాక్సాఫీస్ దగ్గర తన స్టార్ డం చూపించేలా వసూళ్లు కనబరిచాడు. అందుకే పూరణనూరు సినిమాకు 150 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. శివ కార్తికేయన్ సరసన శ్రీలీల ఈ సినిమాలో ఛాన్స్ అందుకుంది. తమిళ్ హీరోనే అయినా శివ కార్తికేయన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అమరన్ సినిమా కూడా తెలుగులో వేరే రెండు సినిమాలతో పోటీ పడి మరి సూపర్ హిట్ అందుకుంది. సో శివ కార్తికేయన్ సినిమా అంటే ఆడియన్స్ అలర్ట్ అయ్యేలా తన ఇమేజ్ సెట్ చేసుకున్నాడు.