అమరన్.. లిస్టులో మరో క్రేజీ రికార్డ్
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 4 Nov 2024 10:51 AM GMTదీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జమ్ముకశ్మీర్ లో పదేళ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన మేజర్ ముకుంద వరద రాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. ముకుంద రాజన్ గా కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబెకా జాన్ వర్గీస్ పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు.
అక్టోబరు 31న విడుదలైన అమరన్.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. యాక్షన్, ఎమోషన్స్.. అలా అనిఆదిశంకరాచార్యుల అంశాల్లోనూ శివ కార్తికేయన్, సాయి పల్లవి పోటీపడి మరీ నటించారని అంతా కొనియాడుతున్నారు. సినిమాకు మెయిన్ అసెట్స్ గా నిలిచారని చెబుతున్నారు. ఇద్దరికీ మెమరబుల్ హిట్ దక్కిందని అంటున్నారు. సినిమా చూసిన అనేక మంది ప్రముఖులు ఇప్పటికీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఓ జెమ్.. అమరన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
దీపావళి బ్లాక్ బస్టర్ గా నిలిచిన అమరన్.. ఇండియాతో పాటు ఓవర్సీస్ స్క్రీన్స్ పై కూడా అదరగొడుతోంది. తాజాగా అరుదైన రికార్డు సాధించింది. నవంబర్ 1-3 వీకెండ్ లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ట్రెండింగ్ నెం. 7లో అమరన్ మూవీ నిలిచింది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో గ్లోబల్ స్థాయి టాప్- 10లో ప్లేస్ దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ సినిమాగా ఘనత సాధించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అంతా మేకర్స్ తో పాటు క్యాస్టింగ్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
అయితే కోలీవుడ్ లో వేరే లెవెల్ వసూళ్లు సాధిస్తోంది అమరన్. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ తో తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమ్ము దులిపేస్తోంది. అలా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నాలుగో రోజు సండే ఓ రేంజ్ లో కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల క్లబ్ లోకి అమరన్ కచ్చితంగా అడుగుపెడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగులో క, లక్కీ భాస్కర్ తో గట్టి పోటీ ఉన్నా.. తగ్గేదేలే అంటే వసూళ్లను సాధిస్తుందని అంటున్నారు. మరి లాంగ్ రన్ లో మొత్తం ఎంత రాబడుతుందో వేచి చూడాలి.