సైకిల్ పై శివ కార్తికేయన్.. పరాశక్తి లీక్ వీడియో..!
బుల్లితెర మీద వీజే గా కెరీర్ మొదలు పెట్టిన అతను ఇప్పుడు స్టార్ హీరోగా తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు
By: Tupaki Desk | 6 Feb 2025 12:43 PM GMTకోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు శివ కార్తికేయన్. బుల్లితెర మీద వీజే గా కెరీర్ మొదలు పెట్టిన అతను ఇప్పుడు స్టార్ హీరోగా తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. శివ కార్తికేయన్ రీసెంట్ మూవీ అమరన్ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ సుధ కొంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అతను స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ టీజర్ తో పరాశక్తి సర్ ప్రైజ్ చేసింది.
ఐతే సినిమాలో శివ కార్తికేయన్ లుక్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ లోని లీక్డ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ కు సంబంధించిన వీడియోస్ తమిళ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమాతో శివ కార్తికేయన్ మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.
అసలైతే సుధ కొంగర ఈ సినిమాను సూర్య తో చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలో ప్రతినాయకుడిగా రవి మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర కూడా అదరగొట్టేస్తుందని అంటున్నారు. సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా అధర్వ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు.
వీజే నుంచి సైడ్ రోల్స్ ఛాన్స్ అందుకున్న శివ కార్తికేయన్ చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోల్లో అతను ఒకడు. తప్పకుండా రాబోయే సినిమాల్లో శివ కార్తికేయన్ మరిన్ని గొప్ప సినిమాలు చేసి తిరుగు లేని స్టార్ గా అవతరించేలా ఉన్నాడు. శివ కార్తికేయన్ సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి. తెలుగులో ఆల్రెడీ ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన అమరన్ సినిమాతో ఇక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. పరాశక్తి తో శివ కార్తికేయన్ సరికొత్త సంచలనాలు సృష్టించేలా ఉన్నాడని చెప్పొచ్చు. ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన సుధ కొంగర సినిమాతో పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది.