ప్రేమించిన అమ్మాయికి తన లవర్ తో పెళ్లి కాలేదని సంతోషించా: శివ కార్తికేయన్
తాజాగా శివ కార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని బయటపెట్టాడు.
By: Tupaki Desk | 13 Feb 2025 3:30 PM GMTఎవరికైనా ఫస్ట్ లవ్ అనేది చాలా స్వీట్ మెమొరీ. మన జీవితంలో మొదటిసారిగా ప్రేమించిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం. మన లైఫ్ లో వారికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సెలబ్రిటీలు సైతం దీనికి అతీతులు కాదు. తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా అందరిలానే తన ఫస్ట్ లవ్ ను మర్చిపోలేనని చెప్తున్నాడు.
తాజాగా శివ కార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీని బయటపెట్టాడు. తన ఫస్ట్ లవ్ ఫెయిలైందని, కాలేజీ రోజుల్లో తాను ఓ అమ్మాయిని ప్రేమించానని, కానీ తనది వన్ సైడ్ లవ్ అని, దూరం నుంచి చూస్తూనే ఆమెను ప్రేమించే వాడినని, తన ప్రేమను ఎప్పుడూ ఆ అమ్మాయికి చెప్పలేదని చెప్పాడు శివ. అయితే ఓ రోజు ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లడం చూశానని, అప్పట్నుంచి ఆమెను చూడలేదని శివ తెలిపాడు.
అలా.. ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ తెలియకుండానే ఫెయిలైపోయిందని, తర్వాత చాలా రోజులకు ఆమెను షాపింగ్ మాల్ లో మళ్లీ చూశానని, అప్పటికే ఆమెకు పెళ్లైపోయిందని, కానీ ఆమె పెళ్లి చేసుకున్నది ముందు ప్రేమించిన వ్యక్తిని కాదని, వేరే అబ్బాయితో ఆమె పెళ్లి జరిగిందని చెప్పాడు. అది చూసి తనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదని సంతోషించానని శివ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని బయటపెట్టాడు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇవాళ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్, ఇండస్ట్రీలోకి వచ్చే నాటికే అతనికి పెళ్లైపోయింది. 2010లోనే శివ, ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆరాధన, గుగన్ దాస్ అని ఇద్దరు పిల్లలున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శివ కార్తికేయన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి.
అందులో ఒకటి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న శివ కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ కానుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక రెండో సినిమా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి. రీసెంట్ గా రిలీజైన పరాశక్తి టీజర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.