అలాంటి సినిమాలు చూసే రోజులుకావివి!
ఆ తర్వాత కాలంతో పాటు అలాంటి కథలు కనుమరుగైపోయాయి? ఇప్పుడు కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సినిమా తీస్తే చూసే పరిస్థితి లేదు.
By: Tupaki Desk | 26 March 2024 7:24 AM GMTవెంకటేష్..శ్రీకాంత్...స్నేహ...సంగీత జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `సంక్రాంతి` అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయతల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ముప్పల నేని శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? అదే పెళ్లైతే తోటికొడళ్లు ఎలా మెలుగుతారు? అన్న అంశాల్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు.
ఆ తర్వాత కాలంతో పాటు అలాంటి కథలు కనుమరుగైపోయాయి? ఇప్పుడు కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సినిమా తీస్తే చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు సినిమా పూర్తిగా మారిపోయింది. ఇన్నో వేటివ్ ఐడి యాలు...స్పై చిత్రాలు..బయోపిక్ ల హవా కొనసాగుతోన్న తరుణం ఇది. అయితే ఇలాంటి సమయంలో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీస్తే ఆదరణ దక్కుతుందా? ఇప్పటి ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్న ముప్పలేనిని ముందుకెళ్తే అందుకు ఛాన్సే లేదన్నారు.
ఈ సందర్భంగా సంక్రాంతి సమయంలో తనకెదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. అవేంటో ఆయ మాటల్లోనే.. `నా 30 ఏళ్ల కెరియర్ లో నేను ఎవరి ఆఫీసుకి వెళ్లి అవకాశాన్ని అడగలేదు. నా దగ్గరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాను అంతే. సంక్రాంతి' సినిమాకి సంబంధించిన కథను నేను సురేశ్ గారికి ఇచ్చాను. ఇప్పుడు ఇలాంటి సినిమాలను ఆడియన్స్ చూసే పరిస్థితి లేదని ఆయన అప్పుడే అన్నారు. ఒకసారి కథ చూడండి ..నచ్చితేనే చేద్దురుగానీ అని నేను అన్నాను.
ఆ తరువాత నాలుగైదు రోజులకు నాకు కాల్ వచ్చింది .. వెంకటేశ్ గారికి కథ నచ్చిందని. ఆ కథ వెంకటేశ్ గారికి నచ్చుతుందని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. అలా అప్పటి సంక్రాంతి మొదలైంది. సురేష్ బాబు గారు చెప్పింది నిజమే అని తర్వాత నాకు అనిపించింది. అప్పటికే కుటుంబ నేపథ్యం కథలకు పెద్దగా డిమాండ్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సురేష్ బాబు గారు అప్పుడలా` అన్నారు.