శివగామి నేనే అయి ఉండాలి: మృణాల్ ఠాకూర్
2022లో సీతా రామంతో తన అరంగేట్రం తర్వాత మృణాల్ తెలుగు సినీపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.
By: Tupaki Desk | 8 Nov 2023 10:03 AM GMTదక్షిణాది సినిమాలు తనకు రొమాన్స్ - కామెడీని అన్వేషించే అవకాశాన్ని ఇచ్చాయని యువకథానాయిక మృణాల్ ఠాకూర్ అన్నారు. ఈ రెండు శైలులు ఇటీవలి సినిమాల్లో కనిపించడం లేదని కూడా వ్యాఖ్యానించారు. యాక్షన్ పూర్తిగా డామినేట్ చేస్తోందని వ్యాఖ్యానించారు. 2022లో సీతా రామంతో తన అరంగేట్రం తర్వాత మృణాల్ తెలుగు సినీపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇటీవల మృణాల్ పెద్ద పాత్రలతో సినిమాలు చేస్తోంది. నాని సహా అగ్ర హీరోల సరసన ఈ బ్యూటీ నటిస్తోంది.
మృణాల్ మాట్లాడుతూ.. నాకు ఇప్పుడు నటించే అవకాశం వచ్చింది. నా పేరు వినిపించే పాత్రలు నావైపు వస్తున్నాయి. నేను ఎప్పటినుండో భాగం కావాలని కోరుకునే చిత్రాలలో అవకాశాలొస్తున్నాయి. ఫాంటసీ, రొమాన్స్, కిడ్స్ చూసేవి నేను కోరుకున్న జానర్‌లు. ముఖ్యంగా దక్షిణాదిన తెలుగులో నాకు అవకాశాలు వచ్చాయి. సీతా రామం విడుదలైనప్పుడు ఆ చిత్రం మార్కెట్‌లో చాలా ఫ్రెష్‌గా ఉంది. పిల్లలకు కూడా నచ్చింది.
'సీతా రామం' విడుదల తర్వాత తెలుగులోనే కాకుండా హిందీ పరిశ్రమలో కూడా నాకు లభించిన ప్రేమ, ప్రశంసలు నమ్మశక్యం కానివి. ఉత్తరాదిన, ముఖ్యంగా కోల్‌కతా మొదలైన ప్రాంతాల ప్రజలు నన్ను సంప్రదించి, మాకు మరిన్ని రొమాంటిక్ సినిమాలు కావాలని చెప్పారు. నేను రొమాంటిక్ సినిమాలకు సరిపోతానని అన్నారు. నిజానికి ఈరోజుల్లో సినిమాల్లో కామెడీ ఎక్కడా లేదు అని కూడా మృణాల్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు తెలుగు చిత్రాలు చేస్తోంది. రొమాంటిక్ డ్రామా 'హాయ్ నాన్న' .. మాస్ మూవీ ఫ్యామిలీ స్టార్ లో నటిస్తోంది. ఇటీవల యాక్షన్ చిత్రాలు ఏల్తున్నాయని, ఆ జానర్ అభిమానులను సంతోషపెట్టాలని కోరుకుంటున్నట్లు మృణాల్ చెప్పారు.
మార్కెట్‌లో చాలా మార్పులు ఉన్నందున ప్రేక్షకులు మానవ భావోద్వేగాలు - సంబంధాల గురించిన సినిమాలు చూస్తున్నారని మృణాల్ తెలిపారు. ప్రజల హృదయాలను హత్తుకునే సినిమాల్లో భాగం కావాలని నేను కోరుకున్నాను. హాయ్ నాన్న-ఫ్యామిలీ స్టార్-ఆంఖ్ మిచోలీ అనేవి కుటుంబాలు ఒకచోట చేరి, సినిమాని ఆస్వాధించడానికి పనికొచ్చేవి. మరో ముఖ్యమైన విషయం మాట్లాడుతూ...ఈ రోజు నేను నటించగలనని ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ రోజు నా తదుపరి స్క్రిప్ట్ ఏమిటనేదే నా పెద్ద ఆందోళన. నాకు సినిమా వస్తుందా లేదా అనే దాని గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు అని కూడా మృణాల్ అంది.
ప్రైమ్ వీడియో సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్ 2' ఎపిసోడ్‌లో ఠాకూర్ కనిపించింది. తాను ఒక రోజు పూర్తి స్థాయి వెబ్ షో చేయడానికి ఇష్టపడతానని చెప్పింది. గతంలో నెట్‌ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్'లో యువ క్వీన్ శివగామి పాత్రను పోషించాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ లో వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటిస్తోందని కథనాలొచ్చాయి. నేను నిజానికి తొమ్మిది ఎపిసోడ్‌లు కలిగిన బాహుబలి సిరీస్‌లో భాగమయ్యాను. ఆ సిరీస్ దురదృష్టవశాత్తూ బయటకు రాలేదు కానీ చాలా బాగుంటుంది. ఈరోజు ఎప్పుడు తెరకెక్కించినా ఆ పాత్ర నాకే కావాలి.. శివగామి నేనే అయి ఉండాలి.. అని కోరుకుంది. కథ , నా పాత్ర బాగుంటే నేను తప్పకుండా వెబ్ సిరీస్ చేస్తాను.. సరైనదాని కోసం ఎదురు చూస్తున్నాను అని కూడా తెలిపింది. మృణాల్ నటించిన తదుపరి చిత్రం పిప్పా వార్ నేపథ్యంలోని సినిమా. ఇది నవంబర్ 10 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.