మంగపతికి నాని మరో ఛాన్స్ ఇస్తాడా..?
హీరోగానే కాదు నిర్మాతగా కూడా అదరగొట్టేస్తున్న నాని లేటెస్ట్ గా కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 18 March 2025 2:30 AMహీరోగానే కాదు నిర్మాతగా కూడా అదరగొట్టేస్తున్న నాని లేటెస్ట్ గా కోర్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నిర్మాతగా సినిమాలు అందరు చేస్తారు కానీ నాని చేస్తున్న సినిమాలు మాత్రం డిఫరెంట్ గా ఉంటున్నాయి. అందుకే నాని నిర్మాణంలో వస్తున్న సినిమాలకు ఎక్కువ సక్సెస్ రేటు ఉంటుంది. కోర్ట్ సినిమాలో మిగతా పాత్రలన్నీ ఏమో కానీ మంగపతి క్యారెక్టర్ కి శివాజిని తీసుకోవడం సర్ ప్రైజింగ్ థింగ్ అని చెప్పొచ్చు.
మంగపతి క్యారెక్టర్ లో శివాజి నటన ఆకట్టుకుంది. సినిమా హైలెటెడ్ అంశాల్లో శివాజి చేసిన మంగపతి పాత్ర ఒకటి. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ తో తన పాతికేళ్ల ఆకలి తీరింది. ఇలాంటి రోజు కోసమే తాను వెయిట్ చేస్తున్నా అంటూ శివాజి చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.
ఐతే నాని కోర్ట్ సినిమా తీసేప్పుడు ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనుకుని ఉంటాడు కానీ ఇంతగా ప్రజాదరణ పొందుతుంది అని ఊహించి ఉండడు. ముఖ్యంగా మంగపతి రోల్ లో శివాజి ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నాని ఇదే ఊపులో తను చేస్తున్న ప్యారడైజ్ సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నార్. నాని శ్రీకాంత్ ఓదెల కలిసి రెండో ప్రయత్నంగా చేస్తున్న ప్యారడైజ్ సినిమా సంథింగ్ డిఫరెంట్ గా రాబోతుంది.
ప్యారడైజ్ సినిమాలో శివాజి లాంటి యాక్టర్ ని తీసుకుంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. నాని ప్రొడ్యూసర్ గా శివాజికి హిట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు తను హీరోగా చేస్తున్న సినిమాలో కూడా అతనికి ఆఫర్ ఇస్తాడేమో చూడాకి.
శివాజి కూడా ఇక మీదట ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. అదేంటో తను హీరోగా చేసి సక్సెస్ కొట్టిన దానికన్నా కోర్ట్ మంగపతి రోల్ లో ఆడియన్స్ తనని రిసీవ్ చేసుకున్న దానికి ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాడు శివాజి. ఇదే ఉత్సాహంలో మరిన్ని మంచి పాత్రలు చేసి మరింతమంది ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
శివాజి బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఎక్కువ ఫాం లోకి వచ్చాడు. ఇక రాబోయే సినిమాల్లో కూడా ఆయన కోసం స్పెషల్ రోల్స్ రాసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.