Begin typing your search above and press return to search.

అమరన్ ట్రైలర్: ఆర్మీ అంటే జాబ్ కాదు.. ఇట్స్ ఏ లైఫ్!!

శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:22 PM GMT
అమరన్ ట్రైలర్: ఆర్మీ అంటే జాబ్ కాదు.. ఇట్స్ ఏ లైఫ్!!
X

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ అమరన్. ఇండియాస్‌ మోస్ట్‌ అనే పుస్తకంలోని మేజర్‌ వరదరాజన్‌ కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ తో కలిసి హీరో కమల్‌ హాసన్ నిర్మిస్తున్నారు. శివ కార్తికేయన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్‌ గా సాయి పల్లవి నటిస్తున్నారు.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అమరన్.. రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇదివరకే మేకర్స్.. టీజర్, గ్లింప్సెస్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అదే జోష్ తో ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ ను టాలీవుడ్ హీరో నాని చేత విడుద‌ల చేయించారు. మూవీ మంచి హిట్ అవ్వాలని నాని ఆకాంక్షించారు.

మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్ జీవితంలో జరిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా అమరన్ సినిమా రాబోతున్న‌ట్లు ట్రైలర్ ద్వారా మరోసారి క్లారిటీ వచ్చింది. శివ కార్తికేయన్.. తన కూతురితో ఆడుకుంటున్న సీన్స్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నింగి, ఆకాశం మధ్య ఉండే దూరమే ప్రేమ అంటూ సాయి పల్లవి అదరగొట్టారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్మీ అంటే జాబ్ కాదు.. ఇట్స్ ఏ లైఫ్ అంటూ హీరో చెప్పిన డైలాగ్స్ మూవీపై ఆసక్తి పెంచాయి.

ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. మూవీ టీమ్ పనితనం ట్రైలర్ తో క్లియర్ గా తెలుస్తోంది. సాయి పల్లవి యాక్టింగ్.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. శివ కార్తికేయన్ కూడా తన పాత్రలో ఇమిడిపోయారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకర్షణీయంగా ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినీ ప్రియుల్లో

దేశభక్తిని పెంపొందించేలా ఉంది. దర్శకుడు రాజ్‌ కుమార్ పెరియసామి క్లియర్ గా కనిపించింది.

నిర్మాణ విషయంలో కమల్ హాసన్ కమిట్మెంట్ ట్రైలర్‌ అంతటా కనిపిస్తోంది. ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన చిత్రం అమరన్ గా ట్రైలర్ సజెస్ట్ చేస్తోంది. మూవీపై అంచనాలు పెంచుతోంది. మరి అమరన్ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.