Begin typing your search above and press return to search.

2018 తో ఆ స్టార్ హీరో భారీ సినిమా ప్లానింగ్!

కోలీవుడ్ హీరో శివ కార్తికేయ‌న్ `అమ‌ర‌న్` తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 March 2025 11:48 AM IST
2018 తో ఆ స్టార్ హీరో భారీ సినిమా ప్లానింగ్!
X

కోలీవుడ్ హీరో శివ కార్తికేయ‌న్ `అమ‌ర‌న్` తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమాతో శివ కార్తికేయ‌న్ 100 కోట్ల క్ల‌బ్ లోకే కాదు 300 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయాడు. శివ కార్తికేయ‌న్ కెరీర్ లో తొలి భారీ వ‌సూళ్ల చిత్ర‌మిదే. దీంతో ఎస్. కె స్టార్ డ‌మ్ ఒక్క‌సారిగా రెట్టింపు అయిపోయింది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లంతా శివ కార్తికేయ‌న్ కోసం క్యూలో ఉన్నారు. ఇప్ప‌టికే కొంత మంది నిర్మాత‌లు భారీ మొత్తంలో అడ్వాన్సులు చెల్లించి ఉన్నారు.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ప్ర‌స్తుతం శివ కార్తికేయ‌న్ `మ‌ద‌రాసి`, `ప‌రాశ‌క్తి` సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌దారిసికి ముర‌గ‌దాస్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా ప‌రాశ‌క్తి చిత్రాన్ని సుధ కొంగ‌ర తెర‌కెక్కి స్తున్నారు. రెండు సినిమాల‌పై భారీఅంచ‌నాలు నెల‌కొన్నాయి.అమ‌ర‌న్ తో హిట్ అందు కోవ‌డంతో ఆ రెండు చిత్రాల మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది.ఈ నేప‌థ్యంలో అమ‌ర‌న్ స‌క్సెస్ ని ఆ రెండు చిత్రాల నిర్మాత‌లు ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు.

అలాగే అట్లీ-బ‌న్నీ ప్రాజెక్ట్ లో కూడా శివ కార్తికేయ‌న్ సెకెండ్ హీరోగా న‌టిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇందులో నిజ‌మెంతో తేలాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ల‌తో సంబంధం లేకుండా ఎస్. కె మ‌రో భారీ ప్రాజెక్ట్ కి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మలయాళ దర్శకుడు జూడ్ ఆంటోని, శివకార్తికేయన్ మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయని స‌మాచారం. ఇది భారీ క‌మ‌ర్శియ‌ల్ హంగులున్న చిత్ర‌మ‌ట‌. పాన్ ఇండియాకి క‌నెక్ట్అయ్యే కాన్సెప్ట్ అని అటున్నారు.

ఇందులో విల‌న్ గా ఆర్య న‌టిస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌. ఏజీఎస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించ‌డానికి ముందుకొస్తుందిట‌. బడ్జెట్ 100 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. ద‌ర్శ‌క‌, హీరోపై నమ్మ‌కంతో ఏజీఎస్ ముందుకొస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. 2018 కేర‌ళ వ‌ర‌ద‌లు ఆధారంగానే `2018` చిత్రాన్ని జూడ్ ఆంటోనీ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియాలో పెద్ద విజ‌యం సాధిం చింది. తెలుగులోనూ భారీ వ‌సూళ్లు సాధించిన చిత్ర‌మిది. 22 కోట్ల‌తో నిర్మించిన సినిమా 180 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో శివ కార్తికేయ‌న్ తో పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.