Begin typing your search above and press return to search.

స్టార్ హీరో టైటిల్ వివాదం మ‌ళ్లీ మొద‌టికి

ఇటీవ‌లి కాలంలో `టైటిల్` వివాదాలు రొటీన్ గా మారాయి. త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టించిన `ప‌రాశ‌క్తి` టైటిల్ ఇదే తీరుగా వివాదంలోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   2 Feb 2025 11:24 AM GMT
స్టార్ హీరో టైటిల్ వివాదం మ‌ళ్లీ మొద‌టికి
X

ఇటీవ‌లి కాలంలో 'టైటిల్' వివాదాలు రొటీన్ గా మారాయి. త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ న‌టించిన 'ప‌రాశ‌క్తి' టైటిల్ ఇదే తీరుగా వివాదంలోకి వ‌చ్చింది. విజయ్ ఆంటోనీ 'శక్తి తిరుమగన్' మేక‌ర్స్‌తో శివ‌కార్తికేయ‌న్ బృందం టైటిల్ వివాదాన్ని పరిష్కరించుకోగలిగారు. కానీ ఇప్పుడు టైటిల్ విషయంలో కొత్త వివాదం తలెత్తింది. శివాజీ గణేషన్ 1952 మూవీ అదే టైటిల్ తో తెకెక్క‌గా, దాని రైట్స్ గురించిన ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. 1952 ప‌రాశ‌క్తి నిర్మాణ సంస్థ నేషనల్ పిక్చర్స్ టైటిల్ హక్కులు తమవేనని నొక్కి చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర ఫిలింమేక‌ర్స్ తమ చిత్రాలకు ఆ టైటిల్‌ను ఉపయోగించే హ‌క్కు లేద‌ని హెచ్చరించింది.

కొత్త నిర్మాత‌లు ఎవ‌రికైనా అనుమ‌తి తప్ప‌నిస‌రి. ఏవీఎం ప్రొడక్షన్స్ కి అన్నిచోట్లా హ‌క్కులు లేవు. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఏవీఎం ఈ సినిమా పంపిణీ హక్కులను కలిగి ఉందని కూడా నేష‌న‌ల్ పిక్చ‌ర్స్ స్పష్టం చేసింది. నాటి `పరాశక్తి` మూవీని డిజిటల్‌గా రీమాస్ట‌ర్ చేసి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం.. ప‌ని ప్రారంభ‌మైంద‌ని కూడా నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. ప‌రాశ‌క్తి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సమయంలో పూర్తి హక్కులు క‌లిగి ఉన్న మేం త‌ప్ప టైటిల్ ని ఎవ‌రూ ఉపయోగించవద్దని అభ్యర్థిస్తున్నామ‌ని నిర్మాణ సంస్థను స్థాపించిన పెరుమాళ్ ముదలియార్ మనవడు ఆర్.కార్తికేయన్ ఒక ప్రకటనలో తెలిపారు.

నిర్మాత‌లు ఇంకా సంప్ర‌దించ‌లేద‌ని, సంప్ర‌దిస్తే టైటిల్ ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌లేద‌ని కార్తికేయ‌న్ చెప్పిన‌ట్లు ముద‌లియార్ మ‌న‌వ‌డు తెలిపారు. చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నందున, ఆ ప్రాంత పంపిణీదారులైన‌ ఏవీఎం ప్రొడక్షన్స్ మాత్ర‌మే నిర్మాతలు అని 'ప‌రాశ‌క్తి-2025' మేకర్స్ భావించి ఉండవచ్చని కూడా అన్నారు. శివ‌కార్తికేయ‌న్ ప‌రాశ‌క్తి చిత్రానికి `ఆకాశం నీ హ‌ద్దురా` ఫేం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.