శివ కార్తికేయన్.. అది రాంగ్ ఛాయిస్ అవుతుందా..?
అసలైతే త్రివిక్రం డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉన్నా అది కాస్త టైం పడుతుందని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్.
By: Tupaki Desk | 8 March 2025 8:15 AM ISTపుష్ప 2తో పాన్ ఇండియా బంపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కాగా పార్ట్ 2 దాన్ని మించి రికార్డ్ వసూళ్లు రాబట్టింది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. అసలైతే త్రివిక్రం డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేయాల్సి ఉన్నా అది కాస్త టైం పడుతుందని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్.
ఐతే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా నుంచి లేటెస్ట్ న్యూస్ ఒకటి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అట్లీ రాసుకున్న ఈ కథలో అల్లు అర్జున్ తో పాటు మరో పవర్ ఫుల్ రోల్ కూడా ఉందట. ఆ పాత్రలో ఒక స్టార్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.
అట్లీ దృష్టిలో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే మొన్నటిదాకా శివ కార్తికేయన్ ఒక సగటు హీరోనే కానీ ఇప్పుడు అతనొక స్టార్.. అమరన్ సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టాడు శివ కార్తికేయన్. ఐతే అల్లు అర్జున్ అట్లీ సినిమాలో శివ కార్తికేయన్ కూడా ఉంటాడని అంటున్నారు. శివ కార్తికేయన్ కి అట్లీ కథ చెప్పాడా లేదా అన్నది తెలియదు కానీ శివ కార్తికేయన్ ఒప్పుకుంటే మాత్రం అది అతని రాంగ్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఆల్రెడీ శివ కార్తికేయన్ తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ సినిమాలో ఎంత ఇంపార్టెంట్ రోల్ అయినా అది అల్లు అర్జున్ ముందు తేలిపోతుంది. అలాంటి రోల్ కి శివ కార్తికేయన్ ఓకే చెబితే మాత్రం కెరీర్ కి నష్టం కలిగిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం శివ కార్తికేయన్ పరాశక్తి, మదరాసి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నాడు శివ కార్తికేయన్.
మరి అల్లు అర్జున్ సినిమాలో శివ కార్తికేయన్ నిజంగా నటిస్తాడా లేదా అన్నది చూడాలి. ఒకవేళ శివ కార్తికేయన్ ఎగ్జైట్ అయ్యేలా అట్లీ నరేషన్ ఇస్తే మాత్రం తెర మీద ఒక మంచి మల్టీస్టారర్ సినిమా చూసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.