Begin typing your search above and press return to search.

సూపర్‌స్టార్‌కి శివ కార్తికేయన్‌ ఇచ్చే మర్యాద ఇదేనా..!

సూపర్‌ స్టార్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన విజయ్‌కి శివ కార్తికేయన్‌ ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2025 9:00 PM IST
Jana Nayagan Vs Parasakthi
X

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్‌ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన విషయం తెల్సిందే. రాజకీయాలతో బిజీగా మారిన నేపథ్యంలో విజయ్ సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'జన నాయగన్‌' సినిమా తర్వాత మరే సినిమాను కమిట్‌ కాలేదు. ఇప్పటికే జన నాయగన్‌ సినిమాతో విజయ్ సినీ కెరీర్‌ సమాప్తం అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే జన నాయగన్‌ సినిమాతో మొత్తం కోలీవుడ్‌ ప్రేక్షకులు విజయ్‌కి హీరోగా విడ్కోలు పలకాలని భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు సైతం విజయ్‌కి ఇండస్ట్రీ నుంచి గొప్పగా వీడ్కోలు పలికి గౌరవించాలని భావిస్తున్నారు. సూపర్‌ స్టార్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన విజయ్‌కి శివ కార్తికేయన్‌ ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

గత రెండు మూడు రోజులుగా విజయ్ 'జన నాయగన్‌' సినిమా విడుదల తేదీ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. పొంగల్‌ కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో జన నాయగన్‌ సినిమాకు పోటీగా మరే సినిమాను పొంగల్‌కి విడుదల చేయకూడదని విజయ్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కి సోలో రిలీజ్ దక్కేలా చేసి గౌరవించాలని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అంటున్నారు. కానీ శివ కార్తికేయన్‌ నటిస్తున్న 'పరాశక్తి' సినిమాను పొంగల్ కానుకగా దించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.

సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'పరాశక్తి' పొంగల్‌కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినీ రిపోర్టర్‌ విశ్వసనీయ సమాచారం అంటూ సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. దాంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. పరాశక్తి సినిమాను పొంగల్‌కి విజయ్ సినిమాకు పోటీగా దించడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ సూపర్‌ స్టార్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా శివ కార్తికేయన్‌ను తిట్టి పోస్తున్నారు. ప్రతి పొంగల్‌కి రెండు మూడు సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ ఈసారి పొంగల్‌ కి విజయ్‌ని మాత్రమే దించితే ఆయనకు కనీస మర్యాద ఇచ్చినట్టు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌ స్టార్‌ విజయ్‌ అంటే శివ కార్తికేయన్‌కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే విజయ్ సినిమాలో శివ కార్తికేయన్‌ గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెల్సిందే. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న శివ కార్తికేయన్‌కు విజయ్ అభిమానులు పలు విషయాల్లో మద్దతుగా నిలిచారు. విజయ్ ఇండస్ట్రీ వదిలేస్తే ఆ ప్లేస్‌ను శివ కార్తికేయన్‌ భర్తీ చేస్తాడని సైతం ఆ మధ్య ప్రచారం జరిగింది. విజయ్‌పై అభిమానం ఉందంటూ ప్రచారం చేసుకునే శివ కార్తికేయన్‌ ఆయనకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ పలువురు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పరాశక్తి సినిమా విడుదల విషయమై జరుగుతున్న ప్రచారంపై శివ కార్తికేయన్‌ వెంటనే స్పందించాలంటూ విజయ్ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. విజయ్‌కి పోటీగా రావడం లేదని ఒక ప్రకటన చేయాలని శివ కార్తికేయన్‌ను సోషల్‌ మీడియా ద్వారా పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మరి శివ కార్తికేయన్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.