Begin typing your search above and press return to search.

శివకార్తికేయన్ 25.. హఠాత్తుగా ఈ మార్పులేంటి..?

ఈమధ్య కాలంలో లేడి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధా కొంగరా ఒకరు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 10:07 AM GMT
శివకార్తికేయన్ 25.. హఠాత్తుగా ఈ మార్పులేంటి..?
X

ఈమధ్య కాలంలో లేడి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధా కొంగరా ఒకరు. ముఖ్యంగా ఆకాశమే హద్దురా సినిమా మంచి ప్రశంసలు అందించింది. అలాగే గురు వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న పురాణనూరు అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో నిర్మాణంలోకి రాబోతున్న ఈ సినిమా కోసం మొదట సూర్యను హీరోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. కానీ అనుకోని కారణాల వల్ల సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, శివకార్తికేయన్ ప్రధాన పాత్రలోకి వచ్చాడు. ఇది శివకార్తికేయన్ కెరీర్‌లో అతని 25వ సినిమాగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ పై ఆయన కూడా చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు.

ఇక సడన్ గా ఈ సినిమాకి సంబంధించిన వర్క్ విషయంలో క్యాస్టింగ్ విషయంలో మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట మలయాళ నటీమణి నజ్రియా ఈ చిత్రంలో కథానాయికగా నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో టాలీవుడ్ లో ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేసారు. శ్రీలీలతో ఇప్పటికే ఫోటోషూట్ కూడా పూర్తయింది.

టాలీవుడ్ లో తన ప్రతిభను నిరూపించుకున్న శ్రీలీల ఈ ప్రాజెక్ట్ ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఇక ఈ చిత్రంలో శివకార్తికేయన్ సోదరుడిగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు టాక్ వచ్చింది. అయితే అనుకోని కారణాల వల్ల దుల్కర్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో తమిళ నటుడు అథర్వను ఎంపిక చేశారు. అథర్వ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.

ఇక ప్రధాన విలన్ పాత్రకు మొదట తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు వినిపించింది. అయితే లోకేష్ సినిమా నుంచి తప్పుకోవడంతో, మలయాళ నటుడు రోషన్ మాత్యు ను విలన్ గా తీసుకున్నారు. ఈ కాస్టింగ్ మార్పులతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. ఇక సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే జనవరి నెలలో ప్రారంభం కానుంది.

శివకార్తికేయన్ 25వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా శివకార్తికేయన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవాలని దర్శకురాలు సుధా కొంగర భావిస్తున్నారు. మొత్తం మీద, పురాణనూరు తమిళ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.