Begin typing your search above and press return to search.

నితిన్ హోమ్ బ్యానర్ లో మరో క్రేజ్ ప్రాజెక్ట్

ఈ మూవీ రైట్స్ ని శ్రేష్ట్ మూవీస్ దక్కించుకుందని తాజాగా వీడియో రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 7:58 AM GMT
నితిన్ హోమ్ బ్యానర్ లో మరో క్రేజ్ ప్రాజెక్ట్
X

హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ అప్పుడప్పుడు కొన్ని నిర్ణయాలతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అక్క నిఖిత రెడ్డి సినిమాలని నిర్మించడంతో పాటు ఇతర మూవీస్ ని డిస్టిబ్యూట్ చేస్తూ ఉంటారు. శ్రేష్ట్ మూవీస్ కి తెలుగు రాష్ట్రాలలో డిస్టిబ్యూషన్ కంపెనీగా మంచి పేరుంది. గతంలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల థీయాట్రికల్ రైట్స్ ని శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వారికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు మరో తమిళ్ మూవీ తెలుగు రాష్ట్రాల థీయాట్రికల్ రైట్స్ ని శ్రేష్ట్ మూవీస్ సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ పెరిస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ అమరన్. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటెర్నేషనల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

రాజ్ కమల్ బ్యానర్ కమల్ హాసన్ దనే సంగతి అందరికి తెలిసిందే. విక్రమ్ సినిమాతో శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డికి మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమరన్ సినిమా తెలుగు స్టేట్స్ థీయాట్రికల్ రైట్స్ ని ఫ్యాన్సీ ధరకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్ ని శ్రేష్ట్ మూవీస్ దక్కించుకుందని తాజాగా వీడియో రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన అమరన్ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శివ కార్తికేయన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా శివ కార్తికేయన్ కనిపించబోతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో కూడా శివ కార్తికేయన్ కి మంచి మార్కెట్ ఉంది. అలాగే సాయి పల్లవి ఇమేజ్ కూడా అమరన్ సినిమాకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

శివ్ అరోరా, రాహుల్ సింగ్ రాసిన ఇండియన్ మోస్ట్ ఫియర్ లెస్ బుక్ లో మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా అమరన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు. శివ కార్తికేయన్ కెరియర్ లో పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో చేస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి.